sankranthi 2022: మూడు రోజుల పాటు సంక్రాంతిని ఎందుకు జరుపుకుంటారంటే..

By Mahesh RajamoniFirst Published Jan 11, 2022, 2:58 PM IST
Highlights

సంక్రాంతి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది.. వాకిట్లో పరిచిన అందమైన రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల సందళ్లు, కోడి పందాలు, నోరూరించే పిండివంటలు, కొత్త అల్లుండ్లు, చుట్టాలతో సంబురంగా గడపడం. పండగ వస్తుందంటే చాలు ఎక్కడున్నా ఊర్లల్లో వాలిపోతుంటారు చాలా మంది. Festive Celebrations ను అందరితో కలిసి చేసుకోవడంలో ఉన్నా ఆనందం కోట్లు సంపాదించినా రాదేమో. అందుకే ఏ పండక్కి అందరూ కలుసుకోలేకపోయినా.. సంక్రాంతికి మాత్రం కుటుంబ సభ్యులంతా ఒకే దగ్గర ఉంటారు.

sankranthi 2022: సంక్రాంతి పండగ అంటేనే సంతోషాల లోగిళి. ఆనందాల కేళి..  ఉద్యోగాల పేరుతో ఇతర దేశాలకు, పట్టణాలకు వెళ్లిన వాళ్లు కూడా సొంతూళ్లకు వచ్చి ఈ పండగను ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ పండగ రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రత్యేకమైనది. ఇతర రాష్ట్రాల్లో సైతం ఈ  సంక్రాంతి సంబురాలను ఘనంగా జరుపుకుంటారు. తెలుగు వారి పండగగా పేరు గాంచిన ఈ సంక్రాంతికి పండగకు చాలా చరిత్రే ఉందండోయ్.   ఉద్యోగాల వేటకు వెళ్లిన వాళ్లు, కూలీ పని చేసేందుకు, పూట గడిపేందుకు కష్టించే కష్టజీవులు అంటూ తేడా లేకుండా సంక్రాంతికి అందరూ ఇంటి బాట పడతారు. ఇలా అందరి రాకతో సంక్రాంతి మరింత అందంగా, ఆనందంగా మారిపోతుంది. అందులోను పళ్లెలు అయితే సందడి సందడిగా.. ఆనందంగా కనిపిస్తాయి. ఇక వస్తూ వస్తూ ఆన్నదాతల కళ్లల్లో ఆనందాల కేళిని తీసుకొస్తుంది ఈ పండగ. మరి ఈ పండగను మూడు రోజులు ఎందుకు  జరుపుకుంటారో తెలుసా.. ఈ మూడు రోజుల్లో ఏమేమీ చేస్తారో తెలుసా.. ? 

ఈ ఏడాది 14న భోగి పండగను జరుపుకుంటే.. 15 వ తేదీన (శనివారం) సంక్రాంతి పండగను జరుపుకుంటాం. ఇక 16 వ తేదీన కనుమ పండగ అంటే లాస్ట్ అదే రోజన్న మాట. ఇక ఈ మూడు రోజులు దేవుళ్ల పూజలు నిర్వహిస్తూ కలకాలం మమల్ని సుఖ సంతోషాలతో ఉండేలా చూడు స్వామీ అంటూ ప్రజలు పూజలు చేస్తారు. ఇక ఈ సంగతి పక్కన పెడితే..  మరక సంక్రాంతి ఏం తెలియజేస్తుందంటే.. అందరితో సరదాగా గడపడం, ఆడుతూ, పాడుగూ కాలక్షేపం చేయడం, అలాగే నోరూరించే స్వీట్లు, వేరు శనగలను తింటూ.. అందరూ ఒకే చోట సమావేశమయ్యి సమయాన్ని గడపడాన్ని సూచిస్తుంది. ఈ రోజున చాలా మంది దాన ధర్మాలు కూడా చేస్తారు 

మకర సంక్రాంతి తర్వాత భోగి పండగ వస్తుంది. ఈ రోజున కుటుంబ సభ్యులంతా కలిసి భోగి మంటలను వేస్తారు. ఆ మంటల్లో ఇంట్లో ఉండే పాత వస్తువులను, ఆవుల పిడకలను వేస్తారు. అలాగే చిన్నపిల్లలపై భోగి పళ్లను కూడా జల్లుతారు. అయితే పురాణాల ప్రకారం దేవతలు శ్రీమహా విష్ణువును చిన్నారిగా భావించి రేగు పళ్లతో అభిషేకం చేశారట. అందుకే చిన్నపిల్లలపై రేగుపళ్లను పోస్తారు. 

మకర సంక్రాంతి సమయంలో అంటే రెండో రోజున సూర్యుడు మరక రాశిలోకి వెళతాడు.  So దక్షిణయానం నుంచి ఉత్తరయాణంలోకి సూర్యుడు ప్రవేశించడంతో పుణ్యకాలం ప్రారంభమవుతుందని శాస్త్రం చెబుతోంది.  మూడో రోజు కనుమ పండగ వస్తుంది. ఆ రోజు ఇష్టంగా సాకుతున్న గోవులను అందంగా అలంకరిస్తారు. పూజలు చేస్తారు. ఇక నాలుగో రోజును ముక్కనుమగా జరుపుకుంటారు. అయితే ఈ రోజున కొత్తగా పెళ్లైన యువతులు సావిత్రి గౌరీ వ్రతం, సౌభాగ్య వ్రతం చేస్తారు. ఎందుకంటే కలకాలం సౌభాగ్యంగా ఉండాలని ఈ పూజలు చేస్తారు. ఇకపోతే పిత్రు దేవతల ఆత్మ శాంతించాలని చాలా మంది సంక్రాంతి రోజున దాన ధర్మాలు కూడా చేస్తుంటారు.  వారి వారి సామర్థ్యం మేరకు ఈ దానాలను చేస్తుంటారు. 

సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు నోరూరించేస్తుంటాయి కదా.. అరిసెలు, గారెలు, బొబ్బట్లు, మురుకులు, గజ్జికాయలు, సున్నుండలు, జంతికలు, గోరువిటిలు, పూతరేకులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వంటల లీస్ట్ ఇంకా ఇంకా పెరిగిపోతుంది. ఎవరికి నచ్చిన వంటలను వాళ్లు వండుకుని తింటూ కుటుంబ సభ్యులంతా సంతోషంగా జరుపుకుంటారు. ఇక పిల్లలు సమయం తెలియకుండా గాలి పటం ఎగరేస్తుంటారు. కొంతమంది పెద్దవారు కూడా పిల్లల్లా మారి పోయి ఎంజాయ్ చేస్తుంటారు. 
 

click me!