Father's day 2022: ‘ఫాదర్స్ డే’ వెనుక ఇంత చరిత్ర ఉందా..?

By Mahesh RajamoniFirst Published Jun 19, 2022, 8:18 AM IST
Highlights

Father's day 2022: నాన్నంటే ధైర్యం, నాన్నంటే ఆదర్శం.. అందుకే ఆ నాడు ఒక కూతురు తన నాన్న కష్టాన్ని గుర్తించి నాన్నకోసం ఒక ప్రత్యేకమైన రోజుకు కావాలని పట్టుబట్టింది. దాని ఫలితమే మనం ఈ నాడు ఫాదర్స్ డే ను సెలబ్రేట్ చేసుకుంటున్నాము.. 

Father's day 2022: ఈ లోకంలో ఎన్నో స్పెషల్ డేస్ ఉన్నాయి. పండుగలతో పాటుగా.. మదర్స్ డే, తోబుట్టువుల డే, మహిళల డే అంటూ ఎన్నింటినో సెలబ్రేట్ చేస్తున్నాం. కానీ మన కోసం రేయిం భవళ్లూ కష్టించే.. నాన్నకు గుర్తుగా ఒక రోజు  అంటూ లేదు. అందుకే ఆ నాడు ఒక కూతురు తన నాన్న కోసం ఒక మదర్స్ డే లాగా ఫాదర్స్ డేను కూడా జరుపుకోవాలని నిశ్చయించుకుంది. దాని ఫలితమే మనం ఈనాడు సెలబ్రేట్ చేసుకుంటున్న ఫాదర్స్ డే. ఇందుకి ఫాదర్స్ డే ఎప్పుడు మొదలైంది. ఎక్కడ మొదలైంది.. లాంటి ఫాదర్స్ డే చరిత్ర గురించి తెలుసుకుందాం పదండి.. 

ఈ సమాజంలో తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పది. ఏమిచ్చినా.. ఎంత చేసినా.. వాళ్ల రుణం తీర్చుకోలేం. మనం పుట్టినప్పటి నుంచి పెద్దగయ్యేదాక మనల్ని కంటికి రెప్పలాగే చూసుకుంటారు. మనమెంత పెద్దవారైనా వాళ్లకు చిన్నపిల్లలమే. స్వార్థం లేని ప్రేమ ఏదైనా ఉందా అంటే అది ఒక్క తల్లిదండ్రుల ప్రేమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఇక తల్లులు పిల్లల పెంపకంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. అదె తండ్రులతై తమ పిల్లల భవిష్యత్తు కోసం.. రాత్రి పగలు అంటూ తేడా లేకుండా కష్టపడతాడు. మీకు తెలుసో.. తెలియదో కాని.. పిల్లలు పుట్టినప్పటినుంచి ప్రతి తండ్రి అధనపు భాద్యతలను ఎత్తుకుంటాడు. కేవలం తన పిల్లల కోసమే. నా పిల్లలకు ఎలాంటి కష్టం రాకూడదని.. చేతనైనదానికంటే ఎక్కువ కష్టపడతాడు. మీకు మంచి భవిష్యత్తునివ్వాలని.  

నాన్నే మనకు ఆదర్శం, సూపర్ హీరో, తొలి స్నేహితుడు, గైడ్, రోల్ మోడల్. మనం కింద పడ్డా వెన్ను తట్టిలేపి మళ్లీ ప్రయత్నించమని ప్రోత్సహిస్తాడు. మన కష్టాల్లో ఎవరు తోడుగా ఉన్నా.. లేకున్నా నాన్న మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. అలాంటి నాన్నకు మీరెమిచ్చినా తక్కువే. ఎంత చేసినా తక్కువే. తండ్రి త్యాగాన్ని గుర్తించడానికి, వారికి సేవ చేయడానికి ఒక్క రోజు సరిపోదు. 

ఫాదర్స్ డే చరిత్ర..

1910 లో ఫాదర్స్ డే తొలిసారిగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫాదర్స్ డే ను సెలబ్రేట్ చేసుకోవాలన్న ఆలోచన.. అమెరికన్ సివిల్ వార్ వెటరన్ విలియం జాక్సన్ స్మార్ట్ కుమార్తె సోనోరాకు వచ్చింది. ఆమె వాషింగ్టన్ లోని స్పోకేన్ లో నివసించేది. సోనోరా తల్లి తన ఆరవ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో మరణించింది. ఆ తర్వాత సోనోరాను తన ఐదుగురు అన్నలను తన నాన్నే పెంచారు. 

అయితే ఒక సమయ౦లో మదర్స్ డే గురి౦చి చర్చిలో సోనోరా ప్రసంగం వింది. తల్లికే కాదు తండ్రికి కష్టానికి కూడా గుర్తింపు కావాలని ఆమె భావించింది. దాంతో ఆమె స్పోకేన్ మినిస్టీరియల్ అలయన్స్ కు వెళ్లి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తండ్రులను గౌరవించడానికి జూన్ 5న స్మార్ట్ పుట్టినరోజును ఫాదర్స్ డేగా గుర్తించాలని కోరింది. కానీ ఫాదర్స్ డేను జూన్ మూడవ ఆదివారాన్ని నిర్ణయించారు. 

జూన్ 20, 1910 న, వాషింగ్టన్ సిటీ మేయర్ ఈ రోజును ఫాదర్స్ డేగా ప్రకటించారు. అయితే మే 1, 1972 న, అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఫాదర్స్ డేను జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. అయితే మొట్టమొదటిసారి అధికారికంగా ఫాదర్స్ డే ను జూన్ 18, 1972 న జరుపుకున్నారు. ఇలా అప్పటి నుంచి ప్రతి ఏడాది జూన్ మూడవ ఆదివారం పెద్ద ఎత్తున ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
 

click me!