టీచర్స్ డే 2022: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తిదాయకమైన కొన్ని కోట్స్ మీకోసం

By Mahesh RajamoniFirst Published Sep 1, 2022, 4:19 PM IST
Highlights

టీచర్స్ డే 2022:   డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. విద్యా రంగానికి ఆయన చేసిన సేవలు అద్వితీయమైనవి. రాధాకృష్ణన్ ఉపనిషత్తుల అనువాదకుడు కూడా. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసిన కొన్ని స్ఫూర్తిదాయకమైన కోట్స్ గురించి తెలుసుకుందాం పదండి..
 

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5న జన్మించారు. ఈ జన్మదినాన్నే భారతదేశం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటోంది. రాధాకృష్ణన్ ఒక గొప్ప వక్త, ఉపాధ్యాయుడు, పండితుడు, తత్వవేత్త, విద్యావేత్త, రాజనీతిజ్ఞుడు కూడా. ఇతను మొదటి ఉప రాష్ట్రపతిగా ఎన్నో సేవలందించారు. 

రాధాకృష్ణన్ సామాజిక, తాత్విక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక, విద్యా రంగాలతో సహా ఆధునిక భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివి. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. నిజమైన గురువు, తత్వవేత్త, యావత్ దేశానికి మార్గదర్శకుడు. ఈయన చెప్పిన కొన్ని స్ఫూర్తిదాయకమైన కోట్స్ మీ కోసం

  • "నా పుట్టినరోజును జరుపుకోవడానికి బదులుగా సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే నేను  గర్విస్తాను." - డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. 
  • జ్ఞానం మనకు శక్తిని ఇస్తుంది. ప్రేమ మనకు సంపూర్ణత్వాన్ని ఇస్తుంది.
  • మనకు అన్నీ తెలుసు అనుకున్నప్పుడే మనం నేర్చుకోవడం మానేస్తాం..
  • సంస్కృతుల మధ్య వారధులు నిర్మించడానికి పుస్తకాలే ఒక సాధనం
  • మన గురించి మనం ఆలోచించుకోవడానికి సహాయపడేవారే నిజమైన బోధకులు 
  • నిజమైన మతం ఒక విప్లవాత్మక శక్తి. ఇది అన్యాయానికి, అణచివేతకు, ఆధిక్యతకు బద్ధ శత్రువు. 
  • మతం కేవలం  ప్రవర్తణ మాత్రమే.. విశ్వాసం కాదు 
  • జీవితం సుఖసంతోలతో నిండిపోవాలంటే జ్ఞానం, విజ్ఞానం చాలా అవసరం. 
  • విద్యసంస్థల ప్రధాన లక్ష్యం విద్యార్థులకు డిగ్రీలు, డిప్లమాలను అందజేయడం కాదు.. విశ్వవిద్యాలయ స్ఫూర్తిని పెంపొందించడం.. వారిలో అభ్యసనను పెంపొందించడం. 
  • ఒక చిన్న చరిత్రను సృష్టించడానికి శతాబ్దాల కాలం పడుతుంది. ఒక సంప్రదాయాన్ని రూపొందించడానికి శతాబ్దాల చరిత్ర పడుతుంది.
  • అధికారం, సంపదలు జీవితానికి ప్రతిరూపాలు మాత్రమే.. ఇవే జీవితం కాదు. 
  • సైన్స్, జ్ఞానం ఆధారం ద్వారానే మీ జీవితం ఆనందంగా సాగుతుంది. 
  • శాంతి అనేది రాజకీయాల ద్వారో లేకపోతే ఆర్థిక మార్పుల ద్వారో కాదు మనిషి స్వభావంలో మార్పునుంచే వస్తుంది. 


 

click me!