పరగడుపున ఈ డ్రింక్ తాగితే.. ఎంత పొట్టైనా కరిగిపోవాల్సిందే..!

By ramya Sridhar  |  First Published Jul 4, 2024, 11:11 AM IST

మీరు కూడా.. బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధఫడుతున్నట్లయితే...  పరగడుపున ఓ డ్రింక్ తాగడం వల్ల ఎంతటి బెల్లీ ఫ్యాట్ అయినా కరిగిపోవాల్సిందే. మరి ఆ డ్రింక్ ఏంటి..? దానిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం...
 


కాస్త కష్టపడితే, ఏదో ఒక డైట్  ఫాలో అవ్వడం వల్ల  బరువు తగ్గవచ్చు. కానీ... బెల్లీ ఫ్యాట్ మాత్రం అంత సులభంగా కరగదు. ముఖ్యంగా మహిళల్లో ఈ బెల్లీ ఫ్యాట్.. హార్మోన్లలో మార్పుల కారణంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ చూడటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కానీ... ఇది మనకు తెలియని ఎన్నో అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. 

శరీరంలోని అనేక హార్మోన్లు మన జీర్ణక్రియ, బరువు ఇతర విధులను నియంత్రిస్తాయి.  ఈ హార్మోన్లలో హెచ్చతగ్గులు ఏర్పడినప్పుడు.. అది శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది.  మీరు కూడా.. బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధఫడుతున్నట్లయితే...  పరగడుపున ఓ డ్రింక్ తాగడం వల్ల ఎంతటి బెల్లీ ఫ్యాట్ అయినా కరిగిపోవాల్సిందే. మరి ఆ డ్రింక్ ఏంటి..? దానిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం...

Latest Videos

undefined

ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున  అల్లం, పసుపు నీటిని తాగితే.. బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగించేస్తుందట.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, అల్లం, పసుపు నీరు బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. దీని కారణంగా, శరీరంలోని మొండి కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. బరువు తగ్గుతుంది.
పసుపు , అల్లం రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. పరగడుపున  ఈ రెండు పదార్థాల నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి బలపడుతుంది. కొవ్వు కూడా త్వరగా కరిగిపోతుంది.

అర అంగుళం అల్లం , చాలా చిన్న ముక్క పచ్చి పసుపును నీటిలో వేసి మరిగించాలి. సగం వరకు మరగనివ్వాలి. ఆ నీటిని కాస్త చల్లారిన తర్వాత ఖాళీ కడుపుతో త్రాగాలి. బెల్లీ ఫ్యాట్ ని.. చాలా తక్కువ రోజుల్లోనే తగ్గించుకోవచ్చు.  దీనితో పాటు, మీరు ఆహారం , వ్యాయామంపై కూడా శ్రద్ధ వహించాలి.

వేపాకు రసం కూడా.. బెల్లీ ఫ్యాట్ ని ఈజీగా కరిగించేస్తుంది.  యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ ఫంగల్ లక్షణాలు వేప ఆకుల్లో ఉన్నాయి. ఇది శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆయుర్వేదంలో ఔషధంగా పరిగణిస్తారు.  ఇది జీవక్రియను పెంచుతుంది. కొవ్వును పెంచే ఎంజైమ్‌లను తగ్గిస్తుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. మొండి పొట్ట కొవ్వును కరిగిస్తుంది. పరగడుపున వేపాకు రసం తీసుకుంటే కూడా ఫలితం చాలా తక్కువ సమయంలోనే కనపడుతుంది. 

click me!