ఒక్క రోజు జ్వరం వచ్చినా డెంగీ యేనా..?

By telugu teamFirst Published Sep 9, 2019, 2:38 PM IST
Highlights

డెంగీకి ప్రత్యేక మందులు ఏమీ ఉండవని, జ్వరం తగ్గడానికి తడిగుడ్డతో వంటిని తుడుస్తుండాలని సూచించారు. దీనితోపాటు పారాసిటమాల్‌ మాత్రలు వేసుకుంటే సరిపోతుందన్నారు. సాధారణంగా వచ్చే జ్వరాల్లో దురద ఉండదని, డెంగీ జ్వరం వస్తేనే ఉంటుందని చెప్పారు. పెద్ద వారిలో 20 వేలు, చిన్న పిల్లల్లో 50వేల కన్నా ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గితే తప్పనిసరిగా ప్లేట్‌లెట్లను ఎక్కించాల్సి ఉంటుందన్నారు.
 
ప్రస్తుతం దోమల బెడద, వాతావరణ మార్పుల కారణంగా...ప్రతి ఒక్కరూ జ్వరాల బారిన పడుతున్నారు. అయితే... చాలా మంది జ్వరం రాగానే అది డెంగీ జ్వరమే అనుకొని భయపడిపోతున్నారు. అయితే.... జ్వరాలన్నీ డెంగీ కాదని వైద్యులు చెబుతున్నారు. అందుకే జ్వరం రాగానే ముందుగానే అది డెంగీ అని భ్రమపడి కంగారుపడవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

డెంగీకి ప్రత్యేక మందులు ఏమీ ఉండవని, జ్వరం తగ్గడానికి తడిగుడ్డతో వంటిని తుడుస్తుండాలని సూచించారు. దీనితోపాటు పారాసిటమాల్‌ మాత్రలు వేసుకుంటే సరిపోతుందన్నారు. సాధారణంగా వచ్చే జ్వరాల్లో దురద ఉండదని, డెంగీ జ్వరం వస్తేనే ఉంటుందని చెప్పారు. పెద్ద వారిలో 20 వేలు, చిన్న పిల్లల్లో 50వేల కన్నా ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గితే తప్పనిసరిగా ప్లేట్‌లెట్లను ఎక్కించాల్సి ఉంటుందన్నారు.

డెంగీ లక్షణాలు...
డెంగీ జ్వరం వస్తే... టెంపరేచర్ 105 వరకు వచ్చే అవకాశం ఉంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. అయితే... జ్వరం ఉన్నప్పటి కంటే... తగ్గిన తర్వాత డెంగీ ప్రమాదకరంగా మారుతుంది. శరీరంపై ఎర్రటి మచ్చలు రావడం, ప్లేట్ లెట్స్ పడిపోవడం, బీపీ తగ్గడం లాంటివి జరగుతుంటాయి. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్లేట్ లెట్స్ పెరగడానికి ఉపయోగపడే ఆహారం తీసుకోవాలి. 

జ్వరం తగ్గాక ఒంటి మీద మచ్చలు వస్తున్నా, తీవ్ర నిస్సత్తువగా ఉన్నా, కాళ్లూ చేతులూ చల్లగా ఉంటున్నా, కడుపులో నొప్పి వస్తున్నా, వాంతులు ఎక్కువ అవుతున్నా.. చిగుళ్ల నుంచి రక్తం వస్తున్నా.. పడుకుని లేవగానే కళ్లు తిరుగుతున్నా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.

click me!