ఈ ప్రపంచంలో భారతదేశం ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసా..?

Published : Aug 07, 2022, 12:32 PM ISTUpdated : Aug 07, 2022, 02:14 PM IST
  ఈ ప్రపంచంలో భారతదేశం ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసా..?

సారాంశం

మన దేశం విభిన్న సాంప్రదాయాలకు, సంస్కృతులకు నెలవు. మరే దేశంలో చూడనటువంటి ఆచారాలను, భాషలను ఇక్కడే చూస్తూం.అందుకే మన దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని పిలుస్తారు. మన దేశంలో ఉన్న ఒక్కో రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాలు వారి స్వంత భాషను, వంటకాలను, దుస్తులను కలిగి ఉంటాయి. అంతేకాదు మన దేశంలో మనకు తెలియని ఎన్నో ప్రత్యేకతలు దాగున్నాయి. అందుకే ప్రపంచ దేశాల్లో మన దేశం.. యూనిక్ కంట్రీగా పేరుతెచ్చుకుంది.   

  • 17 వ శతాబ్ది  తొలినాళ్లలో అంటే బ్రిటీష్ పాలనా కాలం వరకు ఇండియా అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా ఉండేది. అందుకే మన దేశ సంపదకు ఆకర్శితుడైన క్రిస్టోఫర్ కొలంబస్ పొరపాటున అమెరికాను కొనుగొన్నప్పుడు సముద్ర మార్గాన్ని వెతుక్కుంటూ ఇండియాకు వచ్చాడు. 
  • ఇండియా గత 100,0000 సంవత్సరాల చరిత్రలో ఏ దేశాన్ని కూడా ఆక్రమించుకోలేదు.
  • తిరుపతి వెంకటేశ్వరాలయం, కాశీ విశ్వనాథ దేవాలయాలను మక్కా, వాటికన్ సిటీల కంటే ఎక్కువ మంది దర్శించుకుంటారు.
  • ప్రపంచంలోని మరే దేశంలోనే లోని ఎక్కువ మసీదులు (300,000) భారతదేశంలోనే ఉన్నాయి. ప్రస్తుతం 100,000 కు పైగానే మసీదులు ఉపయోగంలో ఉన్నాయి.
  • ప్రస్తుతం మన దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాల ఉంది. అది లక్నోలోని సిటీ మాంటిస్పోరి స్కూల్. దీనిలో విద్యార్థులు 45 వేలకు కంటే ఎక్కువగా ఉన్నారు.
  • 2014 సార్వత్రిక ఎన్నికల్లో 54 కోట్ల మందికి పైగా ఓటు వేశారు. అంటే యూకే, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా జనాభా కన్నా ఎక్కువ మంది.
  • మహారాష్ట్రలోని శని శింగనాపూర్ అనే ఊరిలోని ఇండ్లకు తలుపులే ఉండవట. ఎందుకంటే వారి ఇండ్లలో ఏది దొంగిలించినా.. శనిదేవుని కోపానికి గురయ్యి తగిన శాస్తి జరుగుతుందని వారు నమ్ముతారు. ఈ గ్రామంలో అసలు పోలీస్ స్టేషన్ కూడా ఉండదట.
  • దీపావళీ పండుగ కోసం టపాసుల కోసం భారతీయులు ప్రతి ఏడాది సగటున రూ.3000 కోట్లు ఖర్చుచేస్తున్నారట.
  • ఇండియాలో 1200 పక్షి జాతులు, 350 కి పైగా క్షీరదాలు, 50,000 వృక్ష జాతులతో సహా దాదాపు 90,000 రకాల జంతువులు కూడా ఉన్నాయి.
  •   భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని పిలుస్తారు. 10 భారతీయ రాష్ట్రాలలో 25 మిలియన్ల జనాభా ఉంది. వీళ్లకు వేర్వేరు భాషలున్నాయి. భరతదేశంలో 350 క్షీరదాలు, 1,200 పక్షి జాతులు, 50,000 మొక్కల జాతులతో సహా దాదాపు 90,000 రకాల జంతువులు ఉన్నాయి. ఇంతకు మించి గొప్ప గొప్పకట్టడాలు కూడా ఉన్నాయి. అందుకే ఇండియాను ప్రపంచంలో యూనిక్ కంట్రీగా చెప్పొచ్చు. 

PREV
click me!

Recommended Stories

Kids Health: పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు అరటిపండు, పెరుగు పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది?
అయిదు గ్రాముల్లో అదిరిపోయే సూయి ధాగా చెవి రింగులు