Drinking beer: వాట్ .. బీర్ తాగితే మంచిదా..?

By Mahesh RajamoniFirst Published Jan 13, 2022, 8:01 PM IST
Highlights

Drinking beer: పెళ్లిల్లైనా.. పేరంటాలైనా ముక్క, సుక్క పక్కాగా ఉండాల్సిందే. ఆల్కాహాల్ లో బీర్ తాగే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ బీర్లను కొందరు ఒకటి రెండు సీసాలతో ఆపేస్తే.. మరికొందరు సీసాలకు సీసాలు గుటకాయ స్వాహా అనిపిస్తూ పొట్టను బీర్లతో ఫుల్ చేస్తుంటారు. బీర్ల తాగడం వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి. కానీ మోతాదుకు మించి తాగితే మీ ఆరోగ్యం అంతే సంగతి ఇక.

Beer:  పెళ్లిల్లైనా.. పేరంటాలైనా ముక్క, సుక్క పక్కాగా ఉండాల్సిందే. ఆల్కాహాల్ లో బీర్ తాగే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ బీర్లను కొందరు ఒకటి రెండు సీసాలతో ఆపేస్తే.. మరికొందరు సీసాలకు సీసాలు గుటకాయ స్వాహా అనిపిస్తూ పొట్టను బీర్లతో ఫుల్ చేస్తుంటారు. బీర్ల తాగడం వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి. కానీ మోతాదుకు మించి తాగితే మీ ఆరోగ్యం అంతే సంగతి ఇక.

మద్యం ఆరోగ్యానికి హానికరం అంటారు. హానికరమైనా కానీ.. ఏ వ్యాధి అయినా రానీయండి కానీ మందు బాబులు మాత్రం దాన్ని వదలి ఉండలేరు. ఇందులో బీర్లు సీసాలకు సీసాలు లేపే వారు చాలా మందే ఉన్నారు.  ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం మూలంగా శరీరంలోని కొన్ని అవయవాలు చెడిపోయే ప్రమాదం ఉంది. అలాగే మూత్రపిండాలపై కూడా ప్రభావం పడుతుంది. అయితే బీర్లు (Beer) తాగే వారు తరచుగా ఇలా చెబుతుంటారు.. బీర్లు తాగితే ఏ హానీ జరగదు. అంతా మంచే జరుగుతుందని చెప్పుకుంటూ ఉంటారు.

 అయితే ఇందులో కొంత వరకు నిజం ఉందనే చెప్పుకోవాలి. ఎలాగంటే.. మోతాదులో బీర్లను తాగడం వల్ల శరీరానికి మంచి జరగుతుందని అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. అవునండీ.. బీర్లు మోతాదులో తాగితే మనస్సుకు, శరీరానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని తేలింది. న్యూట్రియంట్స్ పబ్లిష్ చేసిన మెటా Analysis ప్రకారం.. ఆల్కహాల్, బీర్లు తాగితే శరీరంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందనే విషయంపై అధ్యయనం జరిపారు. బీర్ల లో  Natural compounds ఉండటం వల్ల అవి తాగితే మన శరీరంపై అనుకూల ప్రభావం చూపిస్తుందట.

 యితే ఇంతకు ముందు అధ్యయనాలు మద్యపానం తాగడం వల్ల వచ్చే అనర్థాలను తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే మోతాదులో బీర్లను తాగితే గుండె ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు వెళ్లడించారు. అయితే వారానికి 13.5 ఔన్సుల బీరు తాగిన వారి గుండెకు సంబంధించి మంచి ఆరోగ్యంతో ఉన్నారని నిపుణులు పేర్కొన్నారు. దీనితో పాటుగా మధుమేహం సమస్య ఉన్న వారు అప్పుడప్పుడు బీర్ తాగితే ఈ సమస్యను తప్పించుకోవచ్చని తెలుపుతున్నారు. అలాగే శరీరంలో పేరుకుపోయిన Cholesterol ను తగ్గిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

 అయితే ఈ బీర్ మోతాదుకు మించి తాగడం వల్ల ఉపయోగాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఇక ఫిట్ గా ఉండేందుకు కూడా చాలా మంది బీర్లను తాగుతుంటారు. కానీ బీర్లను తాగడం వల్ల ఫిట్ గా ఉండటం అనేది అవాస్తవం. అందుకు మీరు చేయాల్సిందల్లా సరైన ఫుడ్ తీసుకుంటూ వైద్యుల సలహాలు, సూచనలు పాటించడమే మంచి మార్గం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అనేక అనారోగ్య సమస్యలు ఉన్నట్టైతే ఈ బీర్ల జోలికి వెల్లకపోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణుులు హెచ్చరిస్తున్నారు.
 

click me!