బంగారం, వెండితో అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డ్.. దీని ధర, స్పెషాలిటీ ఏంటో తెలిస్తే మాత్రం అవాక్కే.. !

By Shivaleela Rajamoni  |  First Published Jul 2, 2024, 9:57 AM IST

అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ లకే కోట్లు ఖర్చు బెట్టి అందరూ నోరెళ్లబెట్టేలా చేశారు. ఇక పెళ్లి వేడుకకు ఇంకెంత ఖర్చు బెడతారో మన ఊహకే అందదు. అయితే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది ఇంతలా వైరల్ కావడానికి కారణమేంటో తెలుసా? 
 


అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల పెళ్లి వేడుకలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అనంత్ అంబానీ పెళ్లి చేసుకోబోతున్నాడు అన్నప్పటి నుంచి అమ్మాయి ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? అని అప్పటి నుంచి వీళ్ల ప్రీ వెడ్డింగ్ వరకు.. వీళ్లకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో తెగ హల్ అవుతోంది. ఇందుకు కారణం.. ఈ పెళ్లికి వీళ్లు చేసే హడావుడి, ఖర్చులే కారణం. అవును మరి కోటీశ్వరుల పెళ్లి కోట్లల్లోనే అవుతుందని సాధారణ జనాలు అనుకుంటున్నారు. 

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకను ఏ రేంజ్ లో చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.వీళ్ల పెళ్లికి హాజరైన అథితులకు కనీవినీ ఎరుగని రీతిలో అథితి మర్యాదలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్పెషల్ ఫుడ్ ను ఏర్పాటు చేయించారు. ముచ్చటంతా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి అందరికీ తెలసిందే. ఇక వీళ్ల పెళ్లి దగ్గర పడటంతో పెళ్లి పత్రికలు ప్రింట్ అయ్యాయి. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి.. ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో తెగ్గ హల్ చల్ చేస్తోంది. ఇంతలా దీని గురించి మాట్లాడుకోవడానికి ఏముంది అంటే దీని ధరే అని చెప్పాలి. అవును మనం ఊహించని రేంజ్ లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి కార్డు ధర ఉంది. 

Latest Videos

రాధికా, అనంత్ అంబానీ వివాహం జులై 12న అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక వీళ్ల పెళ్లికి అంబానీ కుటుంబం ఓ స్పెషల్ వెడ్డింగ్ కార్డును తయారుచేయించారు. ఈ పెళ్లి కార్డు వివేషాలు తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు. వీళ్ల పెళ్లి కార్డు చాలా చాలా అందంగా ఉంటుంది. నివేదికల ప్రకారం.. ఈ స్పెషల్ కార్డు ధర కూడా మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అవును అనంత్-రాధికల పెళ్లి ఆహ్వాన పత్రిక ధర తెలిస్తే కళ్లు తేలేయడం పక్కా.. 

అనంత్-రాధిక ఆహ్వాన పత్రిక ధర ఎంతంటే?

అనంత్, రాధికా వివాహ ఆహ్వాన పత్రికను మొదటగా నీతా అంబానీ శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయంలో ఉన్న బాబా కాశీ విశ్వనాథ్ కు అందజేశారు. ఆ తర్వాతే ఈ కార్డుకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక అప్పటి నుంచి ఈ కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నివేదికల ప్రకారం.. అనంత్-రాధికల వెడ్డింగ్ కార్డు ధర ఏకంగా 6 నుంచి 7 లక్షల వరకు ఉంటుందని సమాచారం. అయితే ఈ ధర గురించి అధికారిక సమాచారం ఇంత తెలియలేదు. కానీ నివేదికలు మాత్రం ఈ వెడ్డింగ్ కార్డు ధరలో ఇంతలో ఉంటుందని చెప్తున్నాయి.

అనంత్-రాధికల వెడ్డింగ్ కార్డు  ప్రత్యేకత ఏంటంటే? 

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వెడ్డింగ్ కార్డులో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల ప్రత్యేకతలు, ఫీచర్లు ఉన్నాయి తెలుసా? ఈ వెడ్డింగ్ కార్డును అంబానీ ఫ్యామిలీ ఆలయం ఆకారంలో తయారుచేయించారు. ఈ ఆలయాన్ని వెండితో తయారుచేయించి బంగారు విగ్రహాలను ఏర్పాటు చేశారు. 

ఇక ఈ పెళ్లి ఆహ్వాన పత్రికను ఓపెన్ చేయగానే అందులో చతుర్భుజి రూపంలో విష్ణుమూర్తి ఫోటో దర్శనమిస్తుంది. మరొక ప్రత్యేకత ఏంటంటే? ఈ వెడ్డింగ్ కార్డును తెరిచేటప్పుడు వేదమంత్రాల బాణీ మనకు వినిపిస్తుంది. ఇక ఈ కార్డు లోపల సిల్వర్ బాక్స్ కూడా ఉంటుంది. ఏయే కార్యక్రమాలను ఏయే తేదీన నిర్వహిస్తున్నారో తెలిపే కొన్ని ఆహ్వాన పత్రికలు సిల్వర్ బాక్స్ లో ఉంటాయి. 

click me!