అరి కాలికి వెల్లుల్లి రుద్దితే ఏమౌతుంది..?

By ramya SridharFirst Published Jul 1, 2024, 4:54 PM IST
Highlights

అసలు.. పాదాలకు వెల్లుల్లి రుద్దడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి..? ఆమె అలా ఎందుకు చేశారు..? మనం కూడా దానిని ఫాలో అవ్వచ్చా లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మనకు ఏదైనా నొప్పి లేదంటే.. ఆరోగ్య సమస్య వస్తే.. వెంటనే డాక్టర్ ని సంప్రదిస్తాం లేదంటే.. మనకు తెలిసిన ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాం. కానీ.. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లు ఉంటే... మందులదాకా పోనివ్వరు. వారికి తెలిసిన హోమ్ రెమిడీస్ ఏవేవో ప్రయత్నిస్తారు. వాటి వల్ల ఫలితం కూడా వస్తుంది. రీసెంట్ గా.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. ఇదేవిధంగా ఓ హోం రెమిడీ ఉపయోగించారు. ఆమె పెద్ద సినిమా స్టార్ అయినప్పటికీ.. ఆమెకు కోట్లల్లో ఆస్తులు ఉన్నప్పటికీ.. చిన్న ఆయుర్వేద చిట్కా పాటించారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేశారు.

ఆ ఫోటోల్లో, వీడియోల్లో ఆమె.. తన పాదాలకు వెల్లుల్లి రెబ్బలను రుద్దుతూ కనిపించారు. దీంతో.. ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. అసలు.. పాదాలకు వెల్లుల్లి రుద్దడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి..? ఆమె అలా ఎందుకు చేశారు..? మనం కూడా దానిని ఫాలో అవ్వచ్చా లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Latest Videos


సాదారణంగా మనం వెల్లులిని ఆహారంలో భాగం చేసుకుంటాం. ఆహారం పరంగా.. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే.. పాదాలకు అప్లై చేయడం వల్ల కూడా అంతే ప్రయోజనం ఉందట.

వాపు , నొప్పిని తగ్గిస్తుంది.: వెల్లుల్లి నిజానికి యాంటీ-అలెర్జీ లక్షణాలను కలిగి ఉంది. అలాంటప్పుడు వెల్లుల్లిని అరికాళ్లపై రాసి మసాజ్ చేయడం వల్ల వాపు, నొప్పి తగ్గుతాయి. ఎక్కువసేపు ఒకే చోట కూర్చున్నప్పుడు మీ కాళ్లలో వాపు లేదా నొప్పి వంటి సమస్యలు ఉన్నట్లయితే లేదా ఎక్కువసేపు నడిచిన తర్వాత మీకు కొన్నిసార్లు ఈ రకమైన సమస్య ఎదురైతే, వెంటనే.. వెల్లుల్లి రెబ్బలను మీ పాదాలకు వేసి రుద్దాలి.

జ్వరం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది: వెల్లుల్లిలోని లక్షణాలు సహజంగా జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి మీకు జ్వరం వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వెల్లుల్లిని దంచి అరికాళ్లపై రుద్ది మసాజ్ చేయాలి. దీంతో జ్వరం తీవ్రతను తగ్గించుకోవచ్చు.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: వెల్లుల్లిలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. అదే సమయంలో, ఈ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి, మీకు రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు 5 నుండి 10 నిమిషాల పాటు వెల్లుల్లితో మీ అరికాళ్ళకు మసాజ్ చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జబ్బులు సులభంగా దరిచేరవు.

రక్త ప్రసరణను పెంచుతుంది: వీటన్నింటితో పాటు వెల్లుల్లిని అరికాళ్లపై రుద్దడం వల్ల శరీరంలో వేడి ఏర్పడి, శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది.  దీన్ని అరికాళ్లపై రుద్దడం వల్ల రక్తంలో వేడి పెరిగి శరీరం వెచ్చగా ఉంటుంది. కాబట్టి చలి కాలంలో లేదా పాదాలు ఎప్పుడూ చల్లగా ఉండేవారు వెల్లుల్లిని అరికాళ్లపై రుద్దితే శరీరానికి వెచ్చదనం లభిస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది: వెల్లుల్లిలోని గుణాలు మానసిక , శారీరక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

అరికాళ్ళపై వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలి?:
మీకు కావాల్సినంత వెల్లుల్లి రెబ్బలను తీసుకుని, తొక్క తీసి, చేతులతో బాగా నలగగొట్టి, ఆపై మీ  పాదాలకు అప్లై చేసి బాగా మసాజ్ చేయండి. తర్వాత 10 లేదా 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మీ పాదాలను కడగాలి.

click me!