
ఫ్రెండ్స్, కొలీగ్స్, కొందరు బంధువులతో చిల్ కావాలంటే.. బీర్ సరైన దారి. అది వీకెండ్ అయినా.. ఫంక్షన్ అయినా.. అసలు ఏ కార్యం లేకున్నా.. ఒక మూమెంట్ సెలబ్రేట్ చేసుకోవాలంటే చాలా మంది బీర్‌ను ఆశ్రయిస్తారు. తమకు ఇష్టమైన వ్యక్తులతో కూర్చుని బీర్ లాగించేస్తుంటారు. బార్‌లో కూర్చున్నా.. బయట కూర్చున్నా.. ఇంట్లో కూర్చున్నా.. గ్లాసులో దాన్ని పోయడంపై జాగ్రత్త వహిస్తారు. చాలా చోట్ల బార్‌లలోనూ వెయిటర్లు గ్లాసును ఒక వైపు వంచి నురగ రాకుండా బీర్‌ను సర్వ్ చేస్తుంటారు. అదే ప్రొఫెషనల్‌గా ఉన్నదనుకుంటూ చాలా మంది అదే స్టైల్ ఫాలో అయిపోతుంటారు.
సాధారణంగా స్వయంగా బీర్ సర్వ్ చేసుకునేటప్పుడు కూడా గ్లాసును ఒక వైపునకు వంచి నురగ వీలైనంత తక్కువగా వచ్చేలా పోస్తుంటారు. కొందరైతే అసలు నురగ గ్లాసులో స్పేస్‌ను ఆక్రమించకుండా గ్లాసు మొత్తం బీర్ నింపేస్తారు. కానీ, ఇది సరైన పద్ధతి కాదేమో అని కొందరు ఫుడీలు చెబుతున్నారు.
గ్లాసులో బీర్‌ను బబుల్స్ రాకుండా పోస్తున్నామంటే.. అందులోని కార్బన్ డైయాక్సైడ్ (CO2)ను విడుదల కానివ్వడం లేదని అర్థం. అంటే.. ఆ గ్యాస్‌ను అలాగే బీరు బాటిల్ లో నుంచి గ్లాసులోకి నేర్పుగా తెచ్చుకున్నట్టు. దాన్ని అలాగే తాగేస్తే.. పొట్టలోపలికి వెళ్లిన తర్వాత మనం ఏమీ తిన్నా.. లోపల ఆ నురగతో పొట్ట ఇబ్బందిపెడుతుంది. పొట్టంతా ఉబ్బినట్టుగా అయిపోతుంది.
అందుకే బీర్‌ను గ్లాసు వంచి పోయకుండా స్ట్రెయిట్‌గా పెట్టి పోయడమే సరైందని చెబుతున్నారు. తద్వార గ్లాసులోకి బాటిల్ నుంచి బీర్ పడగానే నురగ వచ్చేస్తుంది. సగం గ్లాసు నిండగానే సగం మేరకు నురగ ఆక్రమించేస్తుంది. ఆ నురగ ఆవిరైపోయాక మరింత బీర్‌ను గ్లాసులోకి వంపుకోవాలి. అలా బబుల్స్‌ను గాల్లో కలిసిపోయేలా చేయడం ద్వారా కార్బన్ డయాక్సైడ్‌ను బయటికి పంపిస్తున్నట్టు అర్థం చేసుకోవాలని టైమ్స్ నౌ ఫుడీ సైట్ చెబుతున్నది. ఆ తర్వాత దాన్ని తాగితే.. పొట్టలో దాని ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. కాబట్టి.. నెక్స్ట్ టైం సిట్టింగ్‌లో బీర్‌ను సరిగా సర్వ్ చేసుకునేటప్పుడు ఈ జాగ్రత్త పాటించడం బెటర్.