
తల్లి మనల్ని తొమ్మిది నెలలు కడుపులో మోస్తే… నాన్న మన భవిష్యత్తును భుజాలపై మోస్తాడు. తల్లి ప్రేమను పంచితే, నాన్న బాధ్యతలను మోస్తాడు. మనం మాట్లాడకపోయినా మన అవసరాలు తల్లి లాగే నాన్నకు కూడా అర్థమవుతాయి. అలాంటి ప్రేమతో కూడిన, నిస్వార్థమైన పాత్రను పోషించే తండ్రికి సంవత్సరంలో ఒక్కరోజైనా మన ప్రేమను వ్యక్తపరచాల్సిందే. ఈ ఫాదర్స్ డే (Father’s Day) నాన్నకు ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే, ఈ క్రింది బహుమతుల ఎంపికలు తప్పక పరిశీలించండి:
1.మనసుకు నచ్చే చేనేత..
మీ నాన్నకు చేనేత దుప్పటి, షార్ట్, బెడ్ షీట్ వంటి వాటిని బహుమతిగా ఇవ్వండి. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని కంఫర్ట్‌గా ఉండే, శరీరానికి హితమైన వస్తువులు అతనికి ఆనందం ఇస్తాయి. మీరు వాటిని ఇస్తే..వారు ఆనందంగా ఉపయోగిస్తారు.
2.సంగీత ప్రియులకు..
మీ నాన్నకు సంగీతం నచ్చుతుందా? అయితే బడ్జెట్‌కు అనుగుణంగా మంచి క్వాలిటీ ఉన్న ఇయర్‌ఫోన్లు బహుమతిగా ఇవ్వండి. ఇది ఫాదర్స్ డే కోసం ప్రాక్టికల్‌గా ఉండే అందమైన గిఫ్ట్. ఆఫర్లు ఉన్న సమయంలో కొంటే.. ఇంకా కొంచెం తక్కువ ధరకే లభిస్తాయి.
3.మంచి ఫర్ఫ్యూమ్..
తక్కువ ఘాటు, దీర్ఘకాలం ఉండే మంచి పర్ఫ్యూమ్‌ను బహుమతిగా ఇవ్వండి. మార్కెట్‌లో ఎన్నో బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇది ఒక క్యూట్, కాన్ఫిడెన్స్ ఇచ్చే గిఫ్ట్ అవుతుంది. ఆఫీస్, ఏదైనా ఫంక్షన్ లకు వెళ్లినప్పుడు స్పెషల్ గా కనిపిస్తారు.
4.స్కిన్ కేర్ ప్రొడక్ట్స్..
ఇప్పటి తండ్రులు కూడా తమ లుక్‌పై శ్రద్ధ పెట్టడం ప్రారంభించారు. ఫేస్ వాష్, స్క్రబ్, హెయిర్ ఆయిల్, షాంపూలు వంటి స్కిన్ కేర్ కిట్‌ను బహుమతిగా ఇవ్వండి. ఇది వ్యక్తిగత శ్రద్ధను చూపే గిఫ్ట్ అవుతుంది.
5.మీ ప్రేమ తెలిసేలా..
నాన్నకు చాక్లెట్లు, కప్పులు, మ్యుగ్లు, కీచెయిన్ లాంటి చిన్న కానుకలపై మీ ఫ్యామిలీ ఫోటో ముద్రించి బహుమతిగా ఇవ్వండి. అంతేకాకుండా, ఆయన పేరుతో స్పెషల్ షర్ట్ డిజైన్ చేయించవచ్చు. ఇది అతని మనస్సును తాకే గిఫ్ట్ అవుతుంది.
ఫాదర్స్ డే రోజున నాన్నకు చిన్న కానుక ఇస్తే చాలు... ఆ చిరునవ్వు జీవితాంతం గుర్తుండిపోతుంది. కనీసం ఈ రోజు అయినా మీ ప్రేమను చెప్పండి. నాన్న ఉన్నప్పుడు ఆయన్ని గౌరవించండి, ప్రేమించండి.