
Chicken liver : చికెన్ తినడానికి ఉండే ఇంట్రెస్ట్ చికెన్ లివర్ ను తినడానికి ఉండదు. చికెన్ లవర్స్ లో చాలా మంది చికెన్ లివర్ ను తినడానికి ఇష్టపడరు. కానీ ఈ చికెన్ లివర్ వల్ల మనకు ఎన్నో సమస్యలు దూరమవుతాయి తెలుసా.. అవును చికెన్ లివర్ తింటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చికెన్ లివర్ లో విటమిన్ ఎ, బి, ప్రోటీన్లు , మినరల్స్, ఐరన్, విటమిన్ బి 12, ఫొలేట్, కాల్షియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. మేక లివర్ కంటే చికెన్ లివరే మనకు న్యూట్రిషనల్ ఆహారంగా సహాయపడుతుంది.
ఈ లివర్ లో సెలీనియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కీళ్ల నొప్పులు, Respiratory problems, ఇన్ఫెక్షన్స్, నులిపురుగులు (Worms) వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
చికెన్ లివర్ ను మోతాదుగా ఉడికిస్తే.. అందులో తక్కువ కేలరీలు ఉంటాయి. వీటిని తింటే వెయిట్ పెరుగిపోతామన్న భయం కూడా ఉండదు. ఈ చికెన్ లివర్ లో ఉండే పోషకాలు మనకు విటమిన్ బి12 లోపం లేకుండా చేస్తాయి. అంతేకాదు ఇందులో ఉండే పోషకకాలు రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
అలాగే ఇందులో ఉండే విటమిన్ 12 Brain పనితీరును మెరుగుపరుస్తుంది. చికెన్ లివర్ డయాబెటిస్ పేషెంట్లకు చక్కటి డైట్ కూడా. ఎందుకంటే దీన్ని తినడం వల్ల షుగర్ పేషెంట్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపు మెరుగుపడేలా చేస్తుంది.
ఇందులో ఉండే సెలీనియం గుండె జబ్టులపై పోరాడుతుంది. అంతేకాదు ఇది Cholesterol levels ను కూడా నియంత్రణలో ఉంచుతాయి. లివర్ లో ఉండే ఫోలేట్ లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ముఖ్యంగా కండరాలు, ఎముకలను బలంగా చేస్తుంది.
పోషకాహార లోపం ఉన్న వాళ్లు లివర్ ను తింటే ఈ సమస్య నుంచి బయటపడతారు. అంతేకాదు వీటిని తరచుగా తింటే బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాగా ఇందులో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గర్భిణులు దీనిని తొనకపోవడమే ఉత్తమమని నిపుణులు అంటున్నారు.