
నోటి దుర్వాసన సమస్యగా ఉందా? చాలా కారణాల వల్ల నోటి దుర్వాసన వస్తుంది. శరీరానికి తగినంత నీరు తాగకపోవడం, నోరు పొడిబారడం, ఆహారం తిన్న తర్వాత సరైన సమయంలో నోరు శుభ్రం చేసుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహారాలు నోటి దుర్వాసనకు కారణం కావచ్చు. పొగ తాగడం, మద్యం సేవించడం, కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. అలాగే నోటిలో లేదా శరీర భాగాల్లో వచ్చే వివిధ రకాల రోగాల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. చిగుళ్ల వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు లేదా జీర్ణ సమస్యలు వంటి ఆరోగ్య పరిస్థితులు కూడా నోటి దుర్వాసనకు కారణమవుతాయి.
నోటి దుర్వాసనను నివారించడానికి కొన్ని చిట్కాలు చూద్దాం.
1. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి
ప్రతిరోజు రెండుసార్లు బ్రష్ చేయాలి. నాలుకను కూడా బ్రష్ చేయండి. ఎందుకంటే బ్యాక్టీరియా నాలుక ఉపరితలంపై పేరుకుపోయి దుర్వాసనకు కారణమవుతుంది.
2. మౌత్ వాష్ ఉపయోగించండి
బ్యాక్టీరియాను చంపడానికి యాంటీమైక్రోబయల్ లేదా యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్ ఉపయోగించి మీ నోటిని పుక్కిలించండి.
3. నీళ్లు బాగా తాగండి
నీళ్లు బాగా తాగండి. ఎందుకంటే నోరు పొడిబారడం వల్ల దుర్వాసన వస్తుంది. కాబట్టి ప్రతిరోజు బాగా నీళ్లు తాగండి.
4. ఈ ఆహారాలు మానుకోండి
వెల్లుల్లి, ఉల్లి, కారంగా ఉండే వంటకాలు, పుల్లగా ఉండే ఆహారాలు వంటి కొన్ని ఆహారాలు నోటి దుర్వాసనకు కారణమవుతాయి. కాబట్టి వీటిని తక్కువగా తీసుకోండి. ఒకవేళ తింటే, మౌత్ వాష్ ఉపయోగించి నోటిని శుభ్రం చేసుకోవడం మర్చిపోకండి.
5. ధూమపానం మానేయండి
పొగతాగడం మానేయండి. ఎందుకంటే పొగతాగడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది.
6. మద్యపానం మానుకోండి
మద్యపానం కూడా మానేయండి. ఎందుకంటే ఇది కూడా నోటి దుర్వాసనకు కారణమవుతుంది.
7. నిమ్మకాయ
ఒక కప్పు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి, మౌత్ వాష్‌గా ఉపయోగించవచ్చు.
8. సోంపు గింజలు
భోజనం తర్వాత కొద్దిగా సోంపు గింజలు తినడం అలవాటు చేసుకుంటే నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.
9. యాలకులు భోజనం తర్వాత ఒకటి లేదా రెండు యాలకులు నోటిలో వేసుకుని నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.
10. లవంగాలు
భోజనం చేసిన తర్వాత లవంగాలు నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.