ఆ టాపిక్ మాట్లాడే అబ్బాయిలే.. అమ్మాయిలకు నచ్చుతారట!

By telugu team  |  First Published Apr 23, 2019, 2:39 PM IST

అమ్మాయిలని ఇంప్రెస్ చేయాలని అబ్బాయిలు నానా తంటాలు పడుతుంటారు. వారికి నచ్చేలా ఉండాలని.. అందరికంటే ప్రత్యేకంగా ఉండి.. అమ్మాయిల దృష్టి తమపై పడేందుకు అబ్బాయిలు పడే తిప్పలు అంతా ఇంతా కాదు. 


అమ్మాయిలని ఇంప్రెస్ చేయాలని అబ్బాయిలు నానా తంటాలు పడుతుంటారు. వారికి నచ్చేలా ఉండాలని.. అందరికంటే ప్రత్యేకంగా ఉండి.. అమ్మాయిల దృష్టి తమపై పడేందుకు అబ్బాయిలు పడే తిప్పలు అంతా ఇంతా కాదు. అయితే... అమ్మాయిలు నిజానికి  ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారు అనే విషయంపై ఓ డేటింగ్ యాప్ సర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో  25ఏళ్లు దాటిన యువతీ యువకులు పాల్గొనగా.. వారు చెప్పిన విషయాలు అందరినీ షాకింగ్ కి గురి చేశాయి.  అవేంటంటే.. ప్రపంచంలో 54 శాతం మంది అమ్మాయిలు స్థిరమైన రాజకీయ అభిప్రాయాలున్న అబ్బాయిలంటే ఇష్టమని చెప్పారట.  ఇద్దరు లవర్స్ మాట్లాడుకునే మాటల్లో పాలిటిక్స్ వస్తాయని ఎవరైనా ఊహిస్తారా..? కానీ అలాంటి వాటి గురించి  మాట్లాడటానికి అమ్మాయిలు ఆసక్తి చూపిస్తున్నారట.

Latest Videos

 చాలామందిప్రేమికులు వారి సంభాషణల్లో ఎవరికి ఓటేశావ్.. ఎవరు గెలుస్తారు.. ? ఏపార్టీకి మద్దతిస్తావు.. ఏ నాయకుడు ఎలాంటివాడు వంటి టాపిక్స్ ఎక్కువగా ఉంటాయట. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా యువత ఒక్కోచోట ఒక్కోలా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది.

మన భారత్ విషయానికొచ్చే సరికి.. వ్యక్తిగత జీవితాలపై రాజకీయాలు ఏమాత్రం ప్రభావం చూపవని చెప్పారు. అసలు ఈ రెండు అంశాలకు సంబంధం లేదని చెప్పారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 25 శాతం అమ్మాయిలు, 29 శాతం అబ్బాయిలు అసలు రాజకీయాలంటే ఇష్టమే లేదని చెప్పడం గమనార్హం. 

click me!