కలికాలం...కాబోయే మొగుడ్ని అమ్మేసిన యువతి

By telugu team  |  First Published Apr 23, 2019, 12:15 PM IST

కాలం చాలా మారిపోయింది. ఒకప్పుడు డబ్బు కన్నా.. బంధాలకు, బంధుత్వాలకు విలువ ఇచ్చేవారు. ఇప్పుడు డబ్బుకి ఉన్న విలువ ప్రపంచంలో దేనికీ లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. 


కాలం చాలా మారిపోయింది. ఒకప్పుడు డబ్బు కన్నా.. బంధాలకు, బంధుత్వాలకు విలువ ఇచ్చేవారు. ఇప్పుడు డబ్బుకి ఉన్న విలువ ప్రపంచంలో దేనికీ లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఈ సంగతి పక్కన పెట్టి అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఓ యువతి.. తాను ప్రేమించి.. త్వరలో పెళ్లిచేసుకోవాలని అనుకున్న ఓ యువకుడిని అమ్మేసింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రెడిట్ అనే సోషల్ న్యూస్ ఫ్లాట్ ఫాంలో ఓ యువతి తన పేరు వివరాలు చెప్పకుండా.. తాను చేసిన ఓ విషయాన్ని వివరించింది.ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. యువతి ఓ అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయిది చాలా సంపన్న కుటుంబం. వీరి పెళ్లికి అబ్బాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు.

Latest Videos

దీంతో..పెద్దల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంగేజ్ మెంట్ కూడా చేసేసుకున్నారు. అయితే.. ఆ అమ్మాయితో పెళ్లి వద్దూ అంటూ.. అబ్బాయిని అతని తల్లిదండ్రులు రోజూ ఫోన్లు చేసి మార్చే ప్రయత్నం చేసేవారు.  ఈ క్రమంలో ఆ యువకుడి ప్రవర్తనలోనూ మార్పు రావడం ఆమె గమనించింది.

ప్రతిదానికి యువతిపై ఆంక్షలు విధించేవాడు. ఇలా ఉండు, ఇలా ఉండు, ఇది చెయ్యి.. అలా చెయ్యి.. అంటూ  ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. దానికి తోడు అతనికి తాగుడు అలవాటు కూడా ఉంది. ఆ అలవాటుతో మరింత ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో.. వాటిని తట్టుకోలేక యువతి అతనిని వదిలేద్దామని నిర్ణయం తీసుకుంది.

ఆ సమయంలో ఆ అబ్బాయి తల్లి..ఆమెకు ఫోన్ చేసి.. తన కొడుకును వదిలేస్తే 10వేల డాలర్లు ఇస్తానని బేరం ఆడింది. ఎలాగూ వదిలేద్దామనుకుంది కాబట్టి.. ఆ డబ్బు తీసుకొని బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేసింది. సొంత తల్లిదండ్రులకే తన బాయ్ ఫ్రెండ్ ని అమ్మేసానంటూ.. ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. 

click me!