
Apple Halwa:ప్రతి రోజూ ఆపిల్ ను తినాలంటే విసుగొస్తుందా? అయితే మీకు చక్కటి పరిష్కారం దొరికింది. ఆపిల్ ను స్వీట్ లా తయారు చేసుకుని ఇంటిళ్లి పాది పుష్టిగా తినేయొచ్చు. అదేనండి క్యారెట్ హల్వా లాగా ఆపిల్ హల్వా కూడా తయారు చేసుకుని తినొచ్చు. రుచికి మీరు సంకోచించాల్సిన అవసరం లేదు. ఈ ఆపిల్ హల్వా రుచిలో ది బెస్ట్ అనిపించుకుంటుంది.
ఆపిల్ ఉపయోగాలు: రోజుకో ఆపిల్ పండును తినడం వల్ల వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం రాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండ్లలో విటమిన్ సి మెండుగా లభిస్తుంది. ఇది మన శరీరంలోకి వెళ్లి యాంటీ ఆక్సిడెంట్స్ లా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వీటిని ప్రతిదినం తినడం వల్ల మనలో బి కాంప్లెక్స్ లోపం తలెత్తే అవకాశమే ఉండదు. ముఖ్యంగా ఆపిల్స్ మన నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే Red blood cells Productను పెంచుతుందట.
ప్రతిరోజూ ఆహారం తినడానికి ఒక అరగంట ముందు ఒక ఆపిల్ పండును తినడం వల్ల బరువును కూడా తగ్గొచ్చు. ఎందుకంటే వీటిని తినడం వల్ల పొట్ట నిండుగా అనిపిస్తుంది. దాంతో ఫుడ్ ను ఎక్కువగా తీసుకోలేరు. అంతేకాదు ఈ పండ్లల్లో ఫైబర్ ఎక్కువ మొత్తంలో, కేలరీలు తక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ డైట్ లా ఉపయోగపడుతుంది. మీకు తెలుసా.. హార్ట్ ఆరోగ్యానికి ఆపిల్ ఎంతగానో సహాయపడుతుంది. ఓ అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ ఆపిల్ తినే ఆడవారికి ప్రమాదకరమైన గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 43 శాతం తగ్గుతుందట. అదే మగవారిలో 19 శాతం ఈ ప్రమాదం తగ్గిందని పరిశోధనలు వెళ్లడిస్తున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచైనా ఆపిల్ ను తినని వారు తినడం ప్రారంభించండి..
ఆపిల్ హల్వాకు కావాల్సిన పదార్థాలు: 4 ఆపిల్స్, నాలుగు టీ స్పూన్ల నెయ్యి, చెక్కెర పావు కప్పుు, చిటికెడు యాలకుల పౌడర్, కిస్మిస్, బాదం పప్పులు, జీడిప్పులు, పిస్తాలు గుపెడు తీసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ వెనీలా ఎక్స్ ట్రాక్ట్ తీసుకోవాలి. రంగుకోసం నాలుగు రేకుల కుంకుమ పువ్వును తీసుకోవచ్చు.
తయారీ విధానం: ఆపిల్స్ ను శుభ్రంగా కడిగి వాటి తొక్కను తీసేయాలి. తర్వాత వాటిని సన్నగా తురిమి పక్కన పెటుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టి అందులో ముందుగా నెయ్యి వేసి.. కిస్మిస్ లను, జీడిపప్పులు, పిస్తా, బాదం పప్పులను వేసి బాగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇకపోతే అదే కడాయిలో మిగిలిన నెయ్యిలో ఆపిల్ తురుమును వేసి .. సన్నటి మంటపై వేయించుకోవాలి. కాగా ఆపిల్ తురుము నీరు లేకుండా అవుతున్న సమయంలో అందులో కుంకుమ పువ్వు, చక్కెర వేసి బాగా మిక్స్ చేయాలి. అందులో వేసిన చక్కెర పూర్తిగా కరిగి పాకంలా అయ్యి హల్వా తిక్ గా మారుతుంది. అప్పుడు ఈ హల్వాలో యాలకుల పొడి, Vanilla Extract ను వేసి బాగా కలిసేలా కలిపి.. స్టవ్ ను ఆఫ్ చేయాలి. ఇక దీనిపై వేయించిపెట్టుకున్న డ్రైఫ్రూట్స్ ను వేయాలి. ఇంకేముంది గుమగుమలాడే ఆపిల్ హల్వా రెడీ అయినట్టే. ఈ హల్వాను వేడి వేడిగా తింటే బలే రుచిగా ఉంటుంది.