
ఏడవ తేదీ నుంచి 14 వరకు రోజ్ డే, చాక్లెట్ డే, ప్రామిస్ డే, కిస్ డే, హగ్ డే, టెడ్డి డే, ప్రపోజ్ డే ఇలా వారమంతా ప్రేమికులు ప్రేమ పండుగ జరుపుకుంటారు. అలా నిన్నటి వరకు వాలెంటైన్స్ డే వీక్ ముగిసింది. ప్రేమికులంతా ఆ వారం మొత్తం తమ ప్రేమను మరింత బలపరుచుకున్నారు. అయితే బ్రేకప్ చెప్పుకున్న వాళ్ళకి కూడా ఒక వీక్ అనేది ఉంది. మామూలుగా ప్రేమించుకున్న వాళ్లకు తమ ప్రేమ బలపడటానికి ఎలా అయితే వాలెంటైస్ డే ఉందో బ్రేకప్ చెప్పుకున్న వాళ్లకు కూడా యాంటీ వాలెంటైన్ వీక్ అనేది ఉంది.
అది కూడా ఫిబ్రవరి 15 నుంచి అనగా ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇది కూడా ఒక వారం ఉంటుంది. అయితే ఇది కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. మామూలుగా యాంటీ వాలెంటైన్ అంటే కాస్త కొత్తగా, వినడానికి వింతగా ఉంటుంది. అయితే ప్రేమికులను వ్యతిరేకంగా ఉద్దేశించినట్లయితే కాదు. ఇది కేవలం బ్రేకప్ అంటూ విడిపోయిన వాళ్లు సరదాగా గడపడానికి మరోసారి తమ జీవితాన్ని ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఉంటుంది.
అయితే ఇది కూడా వారం రోజుల పాటు.. ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగా ఉంటుంది. అంటే ఫిబ్రవరి 15న స్లాప్ డే, 16న కిక్ డే, 17న పెర్ఫ్యూమ్ డే, 18న ఫ్లర్టింగ్ డే, 19వ తేదీన కన్ఫెషన్ డే, 20వ తేదీన మిస్సింగ్ డే, ఇక 21వ తేదీన బ్రేకప్ డే ఉంటుంది. అయితే ఇలా ప్రతిరోజు ఒక్కొక్క లాగా ఉండటంతో.. ఆ రోజులకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో చూద్దాం.
స్లాప్ డే: దీనికి అర్థం ఏంటంటే.. ప్రేమ సంబంధంలో వచ్చే చిన్న చిన్న సమస్యలకు ఇది ఒక సంకేతం అన్నట్లుగా భావిస్తారు.
కిక్ డే: దీనికి అర్థం ఏంటంటే.. ఇద్దరి ప్రేమికుల మధ్య మాటల తీవ్రత పెరిగి గొడవ పడేందుకు దారితీస్తుంది.
పర్ఫ్యూమ్ డే: దీనికి అర్థం.. తమ ప్రేమ జీవితంలో వచ్చిన గొడవలు, మానసిక ఇబ్బందులు పడిన వాళ్లకు ఉపశమనం కలిగించడానికి పర్ఫ్యూమ్ డే జరుపుకుంటారు. అంటే అన్ని గొడవలు మర్చిపోయి ముందుకు సాగిపోవాలని ఉద్దేశం అన్నమాట.
ఫ్లర్ట్ డే: ఇద్దరు ప్రేమికులు విడిపోయిన తర్వాత కొత్త జీవితానికి వెల్కమ్ చెప్పడానికి ఈ ఫ్లర్ట్ డే జరుపుకుంటారు.
కన్ఫెషన్ డే: ప్రేమ జీవితంలో ఇప్పటివరకు పడిన కష్టాలు, ఏర్పడిన గాయాలు, ఇబ్బందులు పూర్తిగా మర్చిపోయి.. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఈ కన్ఫెషన్ డే జరుపుకుంటారు.
మిస్సింగ్ డే: ప్రేమ జీవితంలో వచ్చిన ఇబ్బందులు మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తాయి. అంతేకాకుండా ప్రేమించిన వ్యక్తితో గడిపిన అద్భుతమైన క్షణాలను గుర్తుకు చేసుకొని మిస్ అయ్యామన్న బాధ ఉంటుంది. అందుకే దానికి గుర్తుగా ఈ మిస్సింగ్ డే జరుపుకుంటారు.
బ్రేకప్ డే: ఇక చివరి రోజు అయిన బ్రేకప్ డే అనేది.. మిస్సింగ్ డే తర్వాత వస్తుంది. మిస్సింగ్ డే తర్వాత తమ సంబంధం విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. ఇప్పటివరకు ఎవరైతే టాక్సిక్ రిలేషన్ లో ఉన్నారా.. వారంతా ఆ రిలేషన్ నుండి బయటికి వచ్చే రోజుగా బ్రేకప్ డే గా జరుపుకుంటారు.