Leftover Soap Uses: మిగిలిపోయిన సబ్బు ముక్కలతో ఇలా కూడా చేయొచ్చు..యూజ్‌ఫుల్ టిప్స్ ఇవిగో

Published : Mar 24, 2026, 06:40 PM IST
Leftover Soap Uses

సారాంశం

సాధారణంగా మనం మిగిలిపోయిన సబ్బు ముక్కలను పడేస్తుంటాం. కానీ పాత, విరిగిన సబ్బు ముక్కలను మళ్లీ కొత్తగా వాడుకోవచ్చనే విషయం మీకు తెలుసా? కొన్నిసింపుల్ టిప్స్ తో ఇది సాధ్యమే. ఈ టిప్స్ తో డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.

Old Soap Reuse Ideas: స్నానానికి, బట్టలు ఉతకడానికి, గిన్నెలు కడగడానికి మనం సబ్బులు వాడుతుంటాం. అయితే, సబ్బు వాడగా వాడగా బాగా అరిగిపోయి, పల్చగా మారిపోతుంది. అప్పుడు దాన్ని చాలామంది పనికిరాదని పడేస్తుంటారు. కానీ, అలా పడేసే పాత, విరిగిన సబ్బు ముక్కలను చాలా రకాలుగా వాడుకోవచ్చు. మరి అవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందామా.. 

సబ్బు ముక్కలను ఎలా వాడుకోవాలి?

సబ్బు చిన్నగా, ముక్కలుగా లేదా పల్చగా అయిపోతే, వాటితో మీరు కొత్త సబ్బును కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న చిన్న చిన్న సబ్బు ముక్కలన్నింటినీ సేకరించి, డబుల్ బాయిలర్ పద్ధతిలో కరిగించాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఏదైనా ఒక అచ్చులో పోసి గట్టిపడనివ్వాలి. అంతే, కొత్త సబ్బు రెడీ అయిపోతుంది. దాన్ని మీరు స్నానానికి, చేతులు కడుక్కోవడానికి లేదా బట్టలు ఉతకడానికి ఉపయోగించుకోవచ్చు.

లిక్విడ్ హ్యాండ్ వాష్ తయారు చేసుకోవడం

పాత సబ్బు ముక్కలతో మీరు లిక్విడ్ హ్యాండ్ వాష్ కూడా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా మార్కెట్లో దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. లిక్విడ్ హ్యాండ్ వాష్ కోసం సబ్బు ముక్కలను తురుముకోవాలి. ఆ తురుమును నీళ్లలో వేసి బాగా మరిగించాలి. అందులో కొద్దిగా గ్లిజరిన్ కలపాలి. మిశ్రమం కొంచెం చిక్కబడ్డాక, స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని ఒక హ్యాండ్ వాష్ బాటిల్‌లో నింపి చేతులు కడుక్కోవడానికి వాడుకోవచ్చు.

రూమ్ ఫ్రెషనర్‌గా..

మీరు వాడే సువాసన కలిగిన సబ్బులు పల్చగా అయిపోయి, వాటిని పడేయాలనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఆ సబ్బు ముక్కలను బాగా ఆరబెట్టి, ఒక చిన్న క్లాత్ లో మూట కట్టండి. ఈ మూటను మీ అల్మారాలో పెడితే మంచి వాసన వస్తుంది. అంతేకాదు దీన్ని మీ గదిలో రూమ్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగించవచ్చు.

అద్దాలు లేదా గ్లాస్‌లను శుభ్రం చేయడం

మిగిలిపోయిన సబ్బు ముక్కలను అద్దాలు శుభ్రం చేయడానికి కూడా వాడుకోవచ్చు. దీనికోసం, పాత సబ్బు ముక్కలను నీటిలో బాగా కరిగించాలి. ఈ నీటిని ఒక స్ప్రే బాటిల్‌లో నింపాలి. తర్వాత దాన్ని అద్దంపై స్ప్రే చేసి, ఒక న్యూస్‌పేపర్‌తో తుడవాలి. అలా చేస్తే ఇంటి అద్దాలు, గాజు వస్తువులు తళతళా మెరుస్తాయి.

బూట్లు, చెప్పులు శుభ్రం చేయడం

పాత సబ్బు ముక్కలను బూట్లు, చెప్పులు శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. పాత సబ్బును నీటిలో బాగా కలిపి, ఆ నీటిని బూట్లు, చెప్పులపై కొద్దికొద్దిగా స్ప్రే చేయాలి. తర్వాత మెల్లగా బ్రష్‌తో రుద్ది, ఒక పొడి బట్టతో తుడిస్తే మీ షూస్ కొత్తవాటిలా మెరిసిపోతాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bachelor Recipes: 10 నిమిషాల్లో చేసే వంటలు, బ్యాచిలర్స్ కి వరం
Silver Choker: అమ్మాయిల మనసు దోచేస్తున్న సిల్వర్ చోకర్లు