Telugu

Bachelor Recipes: 10 నిమిషాల్లో చేసే వంటలు, బ్యాచిలర్స్ కి వరం

Telugu

చాలా టైమ్ పడుతుంది..

రోజూ వంటలు చేసుకోవాలన్నా, సాంబార్ చేసుకోవాలన్నా చాలా టైమ్ పడుతుంది. అలాంటివారు.. ఈ సింపుల్ వంటకాలు ప్రయత్నిస్తే చాలు.  నిమిషాల్లో చేసేయచ్చు..

Image credits: AI Photo
Telugu

తంబుళి (మామిడికాయతో)

మామిడికాయ గుజ్జులో కొద్దిగా కొబ్బరి తురుము వేసి మిక్సీ పట్టాలి. దానికి జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఇంగువ, పచ్చిమిర్చి వేసి తాలింపు పెట్టాలి. రుచికి సరిపడా ఉప్పు కలపాలి.

Image credits: AI Photo
Telugu

నీరు సారు (చారు)

అరటికాయ/పనస గింజలు/బెండకాయ ముక్కలను నీళ్లలో వేసి ఉడికించాలి. దానికి ఇంగువ, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చితో తాలింపు పెట్టాలి. ఉప్పు వేయాలి. చివరగా  నిమ్మరసం కలపాలి.

Image credits: AI Photo
Telugu

నిమ్మకాయ అప్పేహుళి

కావాల్సినన్ని నీళ్లకు నిమ్మరసం కలపాలి. మినపప్పు, ఆవాలు, ఇంగువ, పచ్చిమిర్చితో తాలింపు పెట్టాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరి.

Image credits: AI Photo
Telugu

మజ్జిగ పులుసు

కొద్దిగా పుల్లగా ఉన్న మజ్జిగలో.. మినపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, ఇంగువ, ఉల్లిపాయ లేదా వెల్లుల్లితో తాలింపు వేసి కలపాలి. రుచికి తగినంత ఉప్పు వేయాలి.
 

Image credits: AI Photo
Telugu

టమాటా పప్పుచారు (నీళ్ల చారు)

కావాల్సినన్ని నీళ్లు పోసి టమాటాలు ఉడికించుకోవాలి. దానికి మినపప్పు, ఆవాలు, ఇంగువ, ఉల్లిపాయ, పచ్చిమిర్చితో తాలింపు పెట్టాలి. రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి.
 

Image credits: AI Photo

Silver Choker: అమ్మాయిల మనసు దోచేస్తున్న సిల్వర్ చోకర్లు

Apple Earrings: ఈ ఆపిల్ చెవిపోగులతో గ్లామర్ క్వీన్‌లా మెరిసిపోతారు

Gold Anklet: పది గ్రాముల బంగారంలో పిల్లల పాదాలకు మెరిసే పట్టీలు

skin tag: వెల్లుల్లితో ఇలా చేస్తే జన్మలో పులిపిర్లు రావు!