రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించి రోడ్లపైకి వస్తున్న ప్రజలను నిలవరించేందుకు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ స్వయంగా రంగంలోకి దిగారు. పోలీసులు, ఇతర అధికారులతో రోడ్లపై తిరుగుతూ కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను అడ్డుకుని జరిమానా విధించారు
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారతదేశంలోని సుమారు 19 రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాల సరిహద్దులను మూసివేయడంతో పాటు జనసంచారం, అన్ని రకాల రవాణా సౌకర్యాలను నిలిపివేశాయి.
ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా మార్చి 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.
undefined
Also Read:డీజీపీ మహేందర్ రెడ్డి: లాక్ డౌన్ నియమాలు ఇవీ....
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా చెబుతున్నా చాలా చోట్ల ప్రజలు పట్టించుకోవడం లేదు. నిబంధనలను అక్రమిస్తూ రోడ్లమీదకు ఇష్టం వచ్చినట్లుగా సంచరిస్తున్నారు. దీంతో రంగంలోకి అధికారులు, పోలీసులు ప్రజలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించి రోడ్లపైకి వస్తున్న ప్రజలను నిలవరించేందుకు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ స్వయంగా రంగంలోకి దిగారు.
Also Read:కరోనావైరస్ ఎఫెక్ట్: కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదు
పోలీసులు, ఇతర అధికారులతో రోడ్లపై తిరుగుతూ కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను అడ్డుకుని జరిమానా విధించారు. రోడ్లపైకి వచ్చిన వారిని మీకేమైనా ప్రత్యేకంగా రూల్స్ ఉన్నాయా అంటూ ఫైరయ్యారు. అత్యవసర పరిస్థితుల్లోనే ఇంటి నుంచి బయటకు రావాలని.. లేదంటే చర్యలు తప్పవని కృష్ణభాస్కర్ హెచ్చరించారు.
అదే సమయంలో తాను నాయకుడిని అని ప్రభుత్వ అధికారులతో దురుసుగా వ్యహరించిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేయాల్సిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని కరీంనగర్, నారాయణపేట, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో ప్రజలు రోడ్ల మీదకు గుంపులు గుంపులుగా వస్తుండటంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.