తెలంగాణలోని కరీంనగర్ లో తొలి కరోనా వైరస్ నమోదైంది. ఇండోనేషియా బృందంతో కలిసి తిరిగిన వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దాంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కరీంనగర్: తెలంగాణలోని కరీంనగర్ లో తొలి కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. ఇండోనేషియా బృందంతో కలిసి తిరిగిన వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు నిర్దారణ అయింది. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 28కి పెరిగింది.
ఇటీవల ఇండోనేషియా నుంచి ఓ బృందం కరీంనగర్ వచ్చింది. వారితో కలిసి తిరిగిన వ్యక్తికి కరోనా వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ధ్రువీకరించారు. అతన్ని కరీంనగర్ నుంచి సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతనితో కలిసి తిరిగినవారు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.
undefined
Also Read: కరోనా ఎఫెక్ట్: కరీంనగర్ లో ఇండోనేషియా బృందానికి ఆశ్రయమిచ్చిన వ్యక్తి అరెస్ట్
ఇళ్లలోంచి ప్రజలు ఎవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇండోనేషియా నుంచి ఇటీవల 11 మంది మతప్రచారకులు వచ్చారు. వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.
వారంతా క్రాంతి సంపర్క్ రైలులో రామగుండం చేరుకున్నారు. ఆ తర్వాత వారు ఆటోలో కరీంనగర్ చేరుకున్నారు. దాంతో కరీంనగర్ లో తీవ్ర కలకలం చెలరేగింది. ఆటో డ్రైవర్ కు పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్ వచ్చింది.
Also Read:కరోనా వైరస్: కరీంనగర్ లో హై అలర్ట్, 144 సెక్షన్ అమలు
ఆ పరిస్థితుల్లో కరీంనగర్ లో ఆంక్షలు విధించారు. 144వ సెక్షన్ విధించారు. ఇంటింటికీ వైద్యం బృందాలు వెళ్లి పరీక్షలు నిర్వహించాయి. రంగంలోకి 100 వైద్య బృందాలు దిగాయి.