jobs: తెలంగాణ కోర్టుల్లో ఉద్యోగాలు...మొత్తం 450 పోస్టుల ఖాళీలు

By Sandra Ashok Kumar  |  First Published Dec 20, 2019, 2:47 PM IST

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాలలో మొత్తం 450 పోస్టులను మంజూరు చేసింది. వీటిలో హైకోర్టులకు 183 సూపర్ న్యూమరరీ పోస్టులను, దిగువ కోర్టులకు 267 అదనపు పోస్టులను కేటాయిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు డిసెంబరు 19న ఉత్తర్వులు జారీ చేశారు.  


తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్నీ న్యాయస్థానాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 450 పోస్టులను మంజూరు చేసింది. వీటిలో హైకోర్టులకు 183 సూపర్ న్యూమరరీ పోస్టులను, దిగువ కోర్టులకు 267 అదనపు పోస్టులను కేటాయిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు డిసెంబరు 19న ఉత్తర్వులు జారీ చేశారు. దిగువ కోర్టుల పోస్టులు మొత్తం 267 డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఆధ్వర్యంలో ఉంటాయి.

also read  BECIL Jobs: డేటాఎంట్రీ ఆప‌రేట‌ర్ ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత చాలు

Latest Videos

undefined

హైకోర్టులో ఉన్న పోస్టులు వివరాలు :  హైకోర్టులకు మంజూరు చేసిన 183 సూపర్ న్యూమరీ పోస్టుల వివరాలు

జాయింట్‌ రిజిస్ట్రార్‌ 01, డిప్యూటీ రిజిస్ట్రార్‌ 03, సెక్షన్‌ఆఫీసర్‌/ కోర్టు ఆఫీసర్‌/ స్ర్కూట్నీ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ 50, కోర్టుమాస్టర్‌/న్యాయమూర్తులు/ రిజిస్ట్రార్‌ పీఎస్‌లు 11, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు 24, ఎగ్జామినర్ 03, డిప్యూటీ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు  12,  డ్రైవర్‌ 30, రికార్టు అసిస్టెంట్‌లు 39.

దిగువ కోర్టులలో ఉన్న పోస్టుల ఖాళీలు

దిగువ కోర్టుల్లో ఉన్న మొత్తం 267 పోస్టులలో 260 పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఉన్నాయి. పోస్టుల్లో నియామకం పొందిన వారిని జిల్లా కోర్టులు, అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులు, అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టులు, జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుల్లో నియమించనున్నారు.

also read CIL Jobs: కోల్ ఇండియాలో ఉద్యోగాలు...మొత్తం 1326 పోస్టులు


పోస్టుల వారీగా వివరాలు 

పబ్లిక్ ప్రాసిక్యూటర్/జేపీవోపీ 04, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ (గ్రేడ్-1) 116, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ (గ్రేడ్-2) 39, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ 101, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 01, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరల్) 01, సూపరింటెండెంట్ 02, సీనియర్ అసిస్టెంట్ 03,

click me!