
న్యూఢిల్లీలోని బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్)లో కాంట్రాక్ట్ పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు కలిగి ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఉన్న ఖాళీల సంఖ్య 50.
also read CIL Jobs: కోల్ ఇండియాలో ఉద్యోగాలు...మొత్తం 1326 పోస్టులు
డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్టుల వివరాలు: డేటా ఎంట్రీ ఆపరేటర్లు (హిందీ/ఇంగ్లిష్)
ఉండాల్సిన అర్హత: ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. హిందీ/ ఇంగ్లిష్ టైపింగ్ వచ్చి ఉండాలి. కంప్యూటర్‌పై ఒక నిమిషానికి 35 పదాలను టైప్ చేయగలగాలి.
దరఖాస్తు విధానం: అఫిషియల్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు పూర్తిగా నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పోస్ట్ పంపాలి.
ఎంపిక విధానం: కంపెనీ నిబంధనల ప్రకారం.
దరఖాస్తు ఫీజు: అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. 'BROADCAST ENGINEERING CONSULTANTS INDIA LIMITED' పేరిట న్యూఢిల్లీలో చెల్లుబాటు అయ్యేలా నిర్ణీత మొత్తంతో డిడి తీయాలి.
also read Railway Jobs:సౌత్-ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు...స్పోర్ట్స్ కోటా కింద నోటిఫికేషన్ విడుదల
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Deputy General Manager (HR)
BECIL's Corporate Office, BECIL Bhawan,
C-56/A-17, Sector-62,
Noida-201307 (U.P).