ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌లో భారీగా నియామకాలు: ఫ్రెషర్స్‌కు ఛాన్స్

By rajashekhar garrepallyFirst Published May 8, 2019, 4:12 PM IST
Highlights

దేశీయ సాఫ్ట్‌‌వేర్ రంగ దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్ఈఅండ్ టీ) ఇన్ఫోటెక్ లిమిటెడ్ తమ సంస్థలో భారీగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. త్వరలోనే 3,800మంది ఫ్రెషర్స్‌ని నియమించుకోనుందని ఆ కంపెనీకి చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు.

‘మేము ఈ ఆర్థిక సంవత్సరంలో 3,700-3800 మంది ఫ్రెషర్స్‌ని నియమించుకోనున్నాం. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 3,000 మంది ఫ్రెషర్స్‌ని నియమించుకున్నాం. జస్ట్ ఇన్ టైమ్ పద్ధతిలో నియామకాలు ఉంటాయి కాబట్టి అందుకు తగ్గ టాలెంట్ ఉన్న ఉద్యోగులు దొరకడం సవాలుగా మారింది’ అని ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ జలోనా వ్యాఖ్యానించారు. 

మార్చి 2019 నాటికి ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ 4,000 మందికి పైగా ఉద్యోగుల్ని నియమించుకుంది. వారిలో 656మందిని నాలుగో త్రైమాసికంలోనే నియమించుకుంది. 

సంస్థ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నియామకాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. అయితే, నిపుణులపై ఉద్యోగులు దొరకడం కష్టతరంగా మారిందని అన్నారు. 

కాగా, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ నాలుగో త్రైమాసికంలో నికర ఆదాయం 31శాతం అంటే రూ. 378.5కోట్లు పెరిగింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో 29.3శాతం అంటే రూ. 9,445 కోట్ల రెవెన్యూ పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో 1.7లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని నాస్‌కామ్ వెల్లడించింది. 

click me!