నిరుద్యోగులకు శుభవార్త... ఉద్యోగాల భర్తీకి ఐటీ కంపనీలు సిద్దం

By Arun Kumar PFirst Published Jan 28, 2019, 1:30 PM IST
Highlights

ఐటీ సేవల దిగ్గజం ‘విప్రో’ ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకటికి రెండుసార్లు క్యాంపస్ సెలెక్షన్ల ద్వారా నియామకాలు చేపట్టనున్నది. పెరుగుతున్న ఆర్డర్లకు అనుగుణంగా డిమాండ్ లక్ష్యాలను చేరుకునేందుకు భారీస్థాయి నియామకాలు చేయనున్నది. 
 

న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ‘విప్రో’ ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకటికి రెండుసార్లు క్యాంపస్ సెలెక్షన్ల ద్వారా నియామకాలు చేపట్టనున్నది. పెరుగుతున్న ఆర్డర్లకు అనుగుణంగా డిమాండ్ లక్ష్యాలను చేరుకునేందుకు భారీస్థాయి నియామకాలు చేయనున్నది. 

2018 వరకు ఆటోమేషన్‌కు కేంద్ర బిందువుగా మారింది ఐటీ రంగం. ఈ నేపథ్యంలోనే సాఫ్ట్‌వేర్ సర్వీస్ సంస్థలు గతేడాది నియామకాలు చేపట్టాయి. అందుకు విప్రో మినహాయింపు కాదు. కానీ దేశీయంగా నాలుగు ఐటీ దిగ్గజాలు వ్రుద్ధి బాటలో పయనిస్తూ పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా యువతలో ప్రతిభావంతులకు చోటు కల్పించేందుకు సిద్దమయ్యాయి. 

Latest Videos

ఈ క్రమంలో బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న విప్రో ఈ ఏడాది 10 వేల మందికి పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నది. అందుకు వీలుగా రెండు దఫాలు క్యాంపస్ సెలెక్షన్లు చేపట్టనున్నది. అమెరికా మొదలు బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు స్థానికతకు పెద్ద పీట వేశాయి. 

విప్రో చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ సౌరవ్ గోవిల్ మాట్లాడుతూ తమ సంస్థ నియామకాలు తగ్గిన మాట నిజమేనని అంగీకరించారు. కొంత విరామం తర్వాత విప్రోతోపాటు పలు భారతీయ ఐటీ సంస్థలు 20 వేల మంది ఉద్యోగుల నియామకం చేపట్టనున్నాయి. గతేడాదితో పోలిస్తే రెట్టింపు ఉద్యోగ నియామకాలు చేపడతామని సౌరవ్ గోవిల్ తెలిపారు. 

భారతీయ ఐటీ సర్వీస్ ప్రొవైడర్లు తమ కస్టమర్లు పెరిగినా కొద్దీ దాన్ని బిజినెస్‌గా మార్చుకునేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అదనంగా 28 వేల మందికి ఉద్యోగాలు నియామకాలు చేపట్టనున్నది. ఈ మేరకు ఆఫర్లు అందజేసింది. హెడ్ హంటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిష్ లక్ష్మీకాంత్ స్పందిస్తూ గతేడాది 10 వేల లోపు మంది ఉద్యోగుల లోపే క్యాంపస్ సెలక్షన్ల ద్వారా విప్రో తెలిపింది. 

బిగ్ డేటా, అనలిటిక్స్ వంటి సంస్థలు ఉద్యోగార్థులకు రెట్టింపు వేతనాలతో కంపెనీలు ఆఫర్లు అందజేసేందుకు ముందుకు వచ్చాయి. ఈ ఏడాది రెండు రకాల నియామకాలను ఐటీ సంస్థలు చేపట్టనున్నాయి. ఒక విభాగంలో ఉద్యోగార్థులకు రూ.3.5 లక్షల ప్యాకేజీలతో, డిజిటల్ టెక్నాలజీ గల నిపుణులకు రూ.6లక్షలకు పైగా వార్షిక వేతన ప్యాకేజీలను ఆఫర్లు అందజేసేందుకు సిద్ధమయ్యాయని హెడ్ హంటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిష్ లక్ష్మీకాంత్ తెలిపారు.


 

click me!