హైద‌రాబాద్‌ 'ఐఐటీ'లో భారిగా ఉద్యోగాలు... వెంటనే అప్లై చేసుకోండీ.

By Sandra Ashok Kumar  |  First Published Jan 27, 2020, 10:14 AM IST

ఐఐటీలో వివిధ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టుల వారీగా విద్యార్హతలను నిర్ణయించారు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


హైద‌రాబాద్‌  నగరంలోలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ)లో వివిధ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టుల వారీగా విద్యార్హతలను నిర్ణయించారు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి. మొత్తం ఉన్న ఖాళీలు 152.


పోస్టుల వివ‌రాలు

Latest Videos

undefined

 రిజిస్ట్రార్-01, చీఫ్ లైబ్రరీ ఆఫీసర్-01, డిప్యూటీ రిజిస్ట్రార్-02, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-01, టెక్నికల్ ఆఫీసర్ (గ్రేడ్-2)-01 నెట్‌వర్క్/ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్-02, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్)-01, స్పోర్ట్స్ ఆఫీసర్ (గ్రేడ్-1)-05,

also read ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ...అప్లై చేసుకోండీ వెంటనే

 మెడికల్ ఆఫీసర్ (గ్రేడ్-1)-01, లేడీ మెడికల్ ఆఫీసర్ (గ్రేడ్-1)-01, టెక్నికల్ ఆఫీసర్ (గ్రేడ్-1)-02, అసిస్టెంట్ రిజిస్ట్రార్-04, బయో సేఫ్టీ ఆఫీసర్-01, వెటర్నరీ డాక్టర్-01, సైకలాజికల్ కౌన్సెలర్-01, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్)-03

అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-01, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్-18, లైబ్రరీ ఇన్‌ఫర్మేషన్ అసిస్టెంట్-02, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్-02, ఫిజియోథెరపిస్ట్-01, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్-01, లేడీ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్-01, జూనియర్ ఇంజినీర్ (సివిల్)-03, జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-02, జూనియర్ అకౌంటెంట్-06, జూనియర్ అసిస్టెంట్-02, జూనియర్ టెక్నీషియన్-36, మల్టీ స్కిల్ అసిస్టెంట్ (గ్రేడ్-1)-22, టెక్నికల్ సూపరింటెండెంట్-26


అర్హత‌: పోస్టుల వారీగా విద్యార్హతలను నిర్ణయించారు. సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంఎస్సీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత‌ పొంది ఉండాలి. తగిన అనుభ‌వం తప్పనిసరిగా ఉండాలి.

also read Bank Jobs: ఇండియ‌న్ బ్యాంక్‌లో ఉద్యోగాలు...వెంటనే దరఖాస్తు చేసుకోండీ


దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.


ద‌ర‌ఖాస్తు విధానం: సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష/ స్కిల్ టెస్ట్‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికలు ఉంటాయి.


 ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ 25.01.2020 చివరితేది 17.02.2020 (సా.5:00 గంటల్లోపు).

click me!