HWB Jobs: హెవీ వాట‌ర్ బోర్డులో ఉద్యోగాలు....వెంటనే అప్లై చేసుకోండీ

By Sandra Ashok Kumar  |  First Published Jan 17, 2020, 10:09 AM IST

హెవీ వాట‌ర్ బోర్డ్‌ దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ హెవీ వాట‌ర్ ప్లాంట్లు, డీఏఈ యూనిట్ల‌లో  ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులను కోరుతున్నారు.
 


భార‌త ప్రభుత్వ అణుశ‌క్తి విభాగం ఆధ్వర్యంలోని హెవీ వాట‌ర్ బోర్డు (HWB) దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనిట్లలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టుల వారీగా తగిన విద్యార్హతలను నిర్ణయించారు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, ఇతర పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపికలు ఉంటాయి. మొత్తం ఉన్న ఖలీలా సంఖ్య 277.

నోటిఫికేషన్ వివ‌రాలు.

Latest Videos

undefined

1. టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌: 28 పోస్టులు  బీఈ/బీటెక్ అర్హత కలిగి ఉండాలి అలాగే అభ్యర్ధులు 40 సంవత్సరాలలోపు వారై ఉండాలి.


2. స్టైపెండ‌రీ ట్రైనీ (కేటగిరీ-1): 65 ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ అర్హత పొంది ఉండాలి ఇంకా అభ్యర్ధులు 18-24 సంవత్సరాల మధ్య వారై ఉండాలి.


3. స్టైపెండ‌రీ ట్రైనీ (కేటగిరీ-2): 92 పదోతరగతి, ఐటీఐ, ఇంటర్ అర్హత కలిగి ఉండాలి. అభర్ధులు 18-24 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి.

 

also read సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల...వెంటనే అప్లై చేసుకోండీ


4. నర్స్-ఎ: 04

అర్హత: ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ (నర్సింగ్).

వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.


5. సైంటిఫిక్ అసిస్టెంట్‌-బి (సివిల్): 05

అర్హత: డిప్లొమా (సివిల్)

వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.


6. సైంటిఫిక్ అసిస్టెంట్‌-బి (రేడియోగ్రఫీ): 01

అర్హత: డిప్లొమా(సివిల్)

వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.


7. టెక్నీషియన్-సి: 03

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

వయోపరిమితి: 18-29 సంవత్సరాల మధ్య ఉండాలి.


8. సబ్ ఆఫీసర్-బి: 05

అర్హత: పదోతరగతితో పాటు తగిన అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 40 సంవత్సరాలకు మించకూడదు.


9. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 02

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. టైపింగ్ తెలిసి ఉండాలి.

వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

also read IT Jobs: అమెజాన్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు


10. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: 08

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. టైపింగ్ తెలిసి ఉండాలి.

వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

11. అప్పర్ డివిజన్ క్లర్క్: 18

అర్హత: డిగ్రీ అర్హతతో పాటు.. టైపింగ్ తెలిసి ఉండాలి.

వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.


12. డ్రైవర్: 20

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.


13. డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమర్ ఫైర్‌మ్యాన్: 26

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు: అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, స్కిల్ టెస్ట్‌, ఫిజిక‌ల్ అసెస్‌మెంట్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ 11.01.2020 దరఖాస్తుకు చివ‌రితేది 31.01.2020

click me!