డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌కు దరఖాస్తుల ఆహ్వానం...వెంటనే అప్లై చేసుకోండీ

By Sandra Ashok KumarFirst Published Mar 3, 2020, 11:38 AM IST
Highlights

షెడ్యూల్డ్‌ తెగల డ్రైవర్‌ ఆర్థిక సహకార సంస్థ లిమిటెడ్‌ (ట్రైకార్‌) ద్వారా డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ ప్రోగ్రాంను అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మేడ్చల్‌ జిల్లా : షెడ్యూల్డ్‌ తెగల డ్రైవర్‌ సాధికారత పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు మేడ్చల్‌ మల్కాజ్ గిరి జిల్లా ఎస్‌టిల అభివృద్ధి శాఖ అధికారి తెలిపారు. షెడ్యూల్డ్‌ తెగల డ్రైవర్‌ ఆర్థిక సహకార సంస్థ లిమిటెడ్‌ (ట్రైకార్‌) ద్వారా డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ ప్రోగ్రాంను అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

also read నిరుద్యోగులకు గుడ్ న్యూస్...హైదరాబాదులో రేపు జాబ్‌మేళా...

ఇందులో భాగంగా డ్రైవర్‌ల నైపుణ్యతను పెంచడం, ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. అలాగే ఏదైనా వాహనాల కొనుగోలుకు ఆర్థిక సాయం అందించడంతో పాటు సుస్తిర ఆదాయం కొరకు ఊబర్‌ సంస్థతో అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. 

అర్హతలు :-

* కనీసం 8వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* 31.1.2020 నాటికి అభ్యర్థి వయస్సు 21 నుంచి 40 మధ్య ఉండాలి.

also read చెఫ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం...వెంటనే అప్లై చేసుకోండీ

* ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షలు.

* 2020 జనవరి 31వ తేదీ నాటికి లైట్‌ మోటర్‌ వెహికిల్‌ లైసెన్స్‌ను కలిగి ఉండాలి. ఎల్‌ఎంవీ లైసెన్స్‌ కలిగిన మహిళా డ్రైవర్లకు ప్రాధాన్యత ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న గిరిజన డ్రైవర్లు www.tsobmms. cgg.gov.in వెబ్‌సైట్‌లో వెబ్‌పోర్టల్‌ నందు ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు. 

click me!