నిరుద్యోగులకు గుడ్ న్యూస్...హైదరాబాదులో రేపు జాబ్‌మేళా...

Ashok Kumar   | Asianet News
Published : Mar 03, 2020, 10:24 AM IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్...హైదరాబాదులో రేపు జాబ్‌మేళా...

సారాంశం

ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రేపు మినీ జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన అధికారి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. 

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని నిరుద్యోగులకు చక్కటి ఉద్యోగ అవకాశం. ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రేపు మినీ జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన అధికారి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు.

మినీ జాబ్‌మేళాలో రిలయన్స్‌ జియోలో డిజిటల్‌ సేల్స్‌ స్పెషలిస్ట్‌, ఈసీఎస్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌లో ఫ్రంట్‌ ఆఫీస్‌ తదితర సంబంధిత ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. నాలుగు  కంపెనీల్లో  సుమారు 190 ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నాట్లు తెలిపారు.

also read TS EAMCET : ఎంసెట్‌ నోటిఫికేషన్ 2020 విడుదల...వెంటనే అప్లై చేసుకోండీ

మరింత పూర్తి వివరాల కోసం 82476 56356 నంబర్‌ ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు. జీవీకే ఈఎంఆర్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్థివ వాహన డ్రైవర్ల నియామకానికి రేపు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రోగ్రాం మేనేజర్‌ ఎస్‌కే జాన్‌ తెలిపారు.

ఆసక్తిగల వారు  డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో కింగ్‌ కోఠిలోని 108 కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు 9100799255 నంబర్‌ ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు.

PREV
click me!

Recommended Stories

చ‌రిత్ర‌లోనే అతిపెద్ద లేఆఫ్‌, 30 వేల ఉద్యోగాలు ఫ‌సక్‌.. టెక్ దిగ్గ‌జం ఉద్యోగుల‌ ఊచ‌కోత‌
Jobs: తెలంగాణ వారికి పోర్చుగ‌ల్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌న్న‌ర జీతం, ఎలా అప్లై చేసుకోవాలంటే