IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు...

Ashok Kumar   | Asianet News
Published : Dec 21, 2019, 11:02 AM ISTUpdated : Dec 21, 2019, 11:04 AM IST
IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు...

సారాంశం

ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఐఓసీఎల్)లో జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(జే‌ఈ‌ఏ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.  నోటిఫికేషన్  ఖాళీల సంఖ్య 37.

ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఐఓసీఎల్)లో జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(జే‌ఈ‌ఏ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత పొందిన ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు నిర్ణీత మొత్తంతో దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలీ. నోటిఫికేషన్  ఖాళీల సంఖ్య 37.

also read jobs: తెలంగాణ కోర్టుల్లో ఉద్యోగాలు...మొత్తం 450 పోస్టుల ఖాళీలు


జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(జేఈఏ)పోస్టుల వివ‌రాలు

విభాగాల వారీగా ఉన్న ఖాళీలు:  జేఈఏ (ప్రొడక్షన్) 33, జేఈఏ (మెకానికల్/ ఫిట్టర్ క‌మ్ రిగ్గర్‌)/ జేటీఏ–IV 02, జేఈఏ (ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌)/జేటీఏ–IV 02,


అర్హత‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, కంట్రోల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధత విభాగంలో ఏడాది అనుభ‌వం కూడా అవసరం. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ప్రొఫీషియన్సీ టెస్ట్/ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

​దరఖాస్తు ఫీజు : దరఖాస్తు ఫీజుగా జనరల్, EWS, ఓబీసీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.12.2019 దరఖాస్తుకు చివరితేది: 17.01.2020

దరఖాస్తులు ప్రింట్ (హార్డ్) కాపీల సమర్పణకు చివరితేది: 01.02.2020

also read BECIL Jobs: డేటాఎంట్రీ ఆప‌రేట‌ర్ ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత చాలు

 రాతపరీక్ష తేది: 02.02.2020 రాతపరీక్ష ఫలితాల వెల్లడి: 07.02.2020

​దరఖాస్తులు పంపాల్సిన చిరునామా

Post Box No. 128,

Panipat Head Post Office, Panipat,

Haryana - 132103.
 

PREV
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
High Demand Jobs : లక్షల ఉద్యోగాలున్నా చేసేవారే లేరు.. జాబ్స్ లిస్ట్ ఇదే, ట్రై చేశారో లైఫ్ సెట్