నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం...రేపు ఒక్క రోజే మాత్రమే...

Published : Dec 12, 2019, 12:17 PM IST
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం...రేపు ఒక్క రోజే మాత్రమే...

సారాంశం

రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి ప్రశాంతి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించటానికి ఈ ఇంటర్వ్యూ నిర్వహిన్నున్నట్లు తెలిపారు. రేపు అంటే 13-12-2019 శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 

రంగారెడ్డి జిల్లా : హైదరాబాద్ నగరంలోని ప్రైవేట్ సంస్థల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించటానికి ఈనెల 13న నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి ప్రశాంతి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించటానికి ఈ ఇంటర్వ్యూ నిర్వహిన్నున్నట్లు తెలిపారు.

also read  ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో ఖాళీలు... పదోతరగతి లేదా ఐటీఐ అర్హత ఉంటే చాలు

రేపు అంటే 13-12-2019 శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు  హాజరు కావొచ్చన్నారు. వివిధ రకంపెనీల్లో మొత్తం 850 ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు ఉపాధి కల్పనాధికారి ప్రశాంతి  తెలిపారు.

also read  కొచ్చిన్ షిప్‌యార్డ్‌ నోటిఫికేషన్ 2019 విడుదల...

జీతం రూ.10వేల నుంచి 25వేల వరకు ఉంటుందని హైదరాబాద్‌లో నగరంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఎస్సెసీ, ఐటీఐ డిప్లొమో, గ్రాడ్యుయేట్, పీజీ చదివినవారు ఈ ఉద్యోగాల ఎంపికకు హాజరు కావాలన్నారు. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, జస్ట్ డయల్, ఎస్‌వీఎల్, భష్యం డెవలపర్స్ తదితర కంపెనీల్లో మల్టీఫుల్ ఉద్యోగావకాశాలు  కల్పించనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువతి, యువకులు ఈ అధ్భూత అవకాశాన్ని సధ్వీనియోగం చేసుకోవాలి అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Bank Jobs : యువతకు సూపర్ ఛాన్స్.. రూ.93,960 జీతంతో మెనేజర్ స్థాయి ఉద్యోగాలు
BHEL Recruitment : కేవలం ఐటిఐ చేసుంటే చాలు.. ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు