కొచ్చిన్ షిప్‌యార్డ్‌ నోటిఫికేషన్ 2019 విడుదల...

By Sandra Ashok Kumar  |  First Published Dec 11, 2019, 1:03 PM IST

కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


కేరళలోని కొచ్చిలో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ డ్రాఫ్ట్స్‌మెన్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. షిప్‌యార్డ్ లోని  సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత పొందినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ప్రాక్టికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

also read SAI Jobs: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశం

Latest Videos

undefined

నోటిఫికేషన్  వివ‌రాలు

షిప్ డ్రాఫ్ట్స్‌మెన్ ట్రైనీ పోస్టులు

మొత్తం ఉన్న ఖాళీలు: 29

విభాగాల వారీగా ఖాళీలు: మెకానిక‌ల్‌-11, ఎల‌క్ట్రిక‌ల్‌-18.

ఉండాల్సిన అర్హత‌: డిప్లొమా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో  (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. డ్రాఫ్ట్‌మెన్‌షిప్ నైపుణ్యాలతోపాటు క్యాడ్ తెలిసి ఉండాలి.

వ‌యోపరిమితి: 20.12.2019 నాటికి 25 సంవత్సరాలకు మించ‌కూడ‌దు.

also read ఎన్‌టి‌ఆర్ ట్రస్ట్ స్కాలర్ షిప్ టెస్ట్ 2019...


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్, ప్రాక్టిక‌ల్ పరీక్షల ఆధారంగా.

శిక్షణ: ఎంపికైనవారికి రెండేళ్ల పాటు శిక్షణ ఉంటుంది. అవసరానికి అనుగుణంగా మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంది.

స్టైపెండ్: శిక్షణ కాలంలో మొదటి సంవత్సరంలో నెలకు రూ.12,600, రెండో సంవత్సరం నుంచి నెలకు రూ.13,800 స్టైపెండ్‌గా ఇస్తారు. అదనపు పనిగంటలకు అదనపు వేతనం ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.12.2019.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.12.2019.

click me!