TSPSC Jobs: టి‌ఎస్‌పి‌ఎస్‌సి నోటిఫికేషన్ 2020 విడుదల...అప్లై చేసుకోవడానికి క్లిక్ చేయండి

By Sandra Ashok Kumar  |  First Published Jan 6, 2020, 10:24 AM IST

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నిర్ణయించారు. సరైన అర్హతలు కలిగిన  వారు ఆన్‌‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 


తెలంగాణ రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నిర్ణయించారు. సరైన అర్హతలు కలిగిన  వారు ఆన్‌‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జనవరి 6 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవతనికి అవకాశాన్ని కల్పించారు. రాత పరీక్ష ద్వారా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


టి‌ఎస్‌పి‌ఎస్‌సి నోటిఫికేషన్  పోస్టుల వివరాలు: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల ఖాళీల సంఖ్య 36

Latest Videos

undefined

విభాగాల వారీగా ఉన్న ఖాళీలు : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)-10, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-26

also read SBI Jobs: ఎస్‌బీఐలో క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.... వెంటనే అప్లై చేసుకోండీ

​అర్హత : అభ్యర్థులు డిగ్రీ (ఫుడ్ టెక్నాలజీ/ డెయిరీ టెక్నాలజీ/ బయోటెక్నాలజీ/ ఆయిల్ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ సైన్స్/ వెటర్నరీ సైన్సెస్/ బయో కెమిస్ట్రీ/ మైక్రో బయాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా) పీజీ డిగ్రీ (కెమిస్ట్రీ) లేదా డిగ్రీ (మెడిసిన్) అర్హత పొంది ఉండాలి.

​వయోపరిమితి: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 01.07.2019 నాటికి 18-34 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.07.2001 నుండి 02.07.1985 మధ్య జన్మించిన వారై  ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఎంపిక చేసే విధానం : రాతపరీక్ష (ఆన్‌లైన్/ఓఎంఆర్), సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


​​దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200, పరీక్ష ఫీజుగా రూ.80 మొత్తం కలిపి 280 చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, నిరుద్యోగులకు (18-34 వయస్సు) పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి ఎలాంటి మినహాయింపు ఉండదు.

also read UPSC: యుపి‌ఎస్‌సిలో వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల...మొత్తం ఖాళీలు 29

​రాతపరీక్ష విధానం: మొత్తంగా 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో రెండు పేపర్లు(పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఒక్కో పేపర్‌లో 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు కేటాయించారు. పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, పేపర్-2లో అభ్యర్థికి సంబంధించిన విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్-1 పరీక్ష తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో, పేపర్-2 పరీక్ష కేవలం ఇంగ్లిష్‌ మధ్యమంలోనే ఉంటుంది.


జీతం: ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.28,940-రూ.78,910 పేస్కేలు ఉంటుంది. ఇతర భత్యాలు అదనంగా ఉంటాయి.


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ 06.01.2020 చివరితేది: 25.01.2020 (11:59 P.M)పరీక్షకు వారంరోజుల ముందుగా హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవలీ. పరీక్ష నిర్వహించే తేదిని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

అప్లై చేసుకోవడానికి  https://www.tspsc.gov.in/index.jsp  క్లిక్ చేయండి
 

click me!