దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ & ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ & ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి, ఐటీఐ అర్హత పొందిన వారు దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
also read SBI Jobs: ఎస్‌బీఐలో క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.... వెంటనే అప్లై చేసుకోండీ
undefined
ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు పోస్టుల వివరాలు
మొత్తం ఉన్న ఖాళీలు 6066
కేటగిరీ వారీగా ఖాళీలు: ఐటీఐ కేటగిరీ 3847, నాన్-ఐటీఐ కేటగిరీ 2219,
అర్హతలు: నాన్-ఐటీఐ కేటగిరీకి చెందిన వారు కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 40 శాతం మార్కులు పొంది ఉండాలి. ఐటీఐ కేటగిరీకి చెందిన వారు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 09.02.2020 నాటికి 15-24 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
also read Jio jobs: రిలయన్స్ జియోలో ఉద్యోగాలు... డిగ్రీ, పీజీ అర్హత ఉంటే చాలు
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా. ఐటీఐ, నాన్-ఐటీఐ విభాగాలకు వేర్వేరుగా ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ 10.01.2020 చివరితేది 09.02.2020.