ఐటీఐ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..

By Sandra Ashok KumarFirst Published Oct 31, 2020, 6:08 PM IST
Highlights

లాక్ డౌన్ సడలింపుతో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం రైల్వే జోన్లు నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగా కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (కే‌ఆర్‌సి‌ఎల్) 58 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. లాక్ డౌన్ సడలింపుతో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం రైల్వే జోన్లు నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగా కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (కే‌ఆర్‌సి‌ఎల్) 58 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 27. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం http://konkanrailway.com/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.  

మొత్తం ఖాళీల సంఖ్య- 58
అన్ రిజర్వ్‌డ్- 32
ఈడబ్ల్యూఎస్- 04
ఓబీసీ- 3
ఎస్‌సీ- 14
ఎస్‌టీ- 5
ఎక్స్ సర్వీస్‌మెన్- 6

also read బీటెక్ లేదా డిప్లొమాతో బీడీఎల్‌లో అప్రెంటిస్‌లు పోస్టులు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ.. ...

విద్యార్హతలు: మెట్రిక్యులేషన్ లేదా ఎస్ఎస్‌సీతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 1 జనవరి 2021 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయస్సు వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు  ప్రారంభ తేదీ: 28 అక్టోబర్ 2020
దరఖాస్తు చివరి తేదీ: 27 నవంబర్  2020
ఎంపిక చేసే విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీలు, ఈబీసీ అభ్యర్థులకు రూ.250, మిగిలిన వారికి రూ.500.
వెబ్‌సైట్‌: http://konkanrailway.com/

click me!