తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 20 వేల పోలీస్‌ ఉద్యోగాలు‌: హోం మంత్రి

By Sandra Ashok KumarFirst Published Oct 23, 2020, 12:56 PM IST
Highlights

 తెలంగాణ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందిన 1162 పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమంలో మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.

తెలంగాణలో త్వరలో 20 వేల పోలీస్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ ప్రకటించారు. తెలంగాణ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందిన 1162 పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమంలో మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు తెలంగాణ పోలీస్‌ అకాడమీ ద్వారా 1,25,848 మందికి శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు.

Latest Videos

అలాగే రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 18,428 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. తాజా పరిస్థితులకు, మార్పులకు అనుగుణంగా పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమయోచితంగా, రాజ్యాంగ బద్ధంగా పోలీస్‌ వ్యవస్థ, అధికారులు పనిచేయాల్సి అవసరం ఉందని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు మంచి గుర్తింపు, గౌరవం ఉందని దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్యం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. నూతన సాంకేతికతకు కేటాయిస్తూ అధిక బడ్జెట్‌ కేటాయిస్తున్నామన్నారు.

పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ గౌరవం ఇవ్వాలని వెల్లడించారు. అలాగే ప్రజలకు సేవ చేయడం ద్వారా సమాజంలో గుర్తింపుతో పాటు సమాజంలో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

click me!