ఈఎస్‌ఐ హాస్పిటల్‌ లో ఉద్యోగాలు‌.. రేపటి నుంచే ఇంటర్వ్యూలు ప్రారంభం..!

Ashok Kumar   | Asianet News
Published : Oct 22, 2020, 06:02 PM ISTUpdated : Oct 22, 2020, 06:03 PM IST
ఈఎస్‌ఐ హాస్పిటల్‌ లో  ఉద్యోగాలు‌.. రేపటి నుంచే ఇంటర్వ్యూలు ప్రారంభం..!

సారాంశం

 ఈఎస్‌ఐ హాస్పిటల్‌ లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు అక్టోబర్ 23 నుండి  ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

ఈఎస్‌ఐ హాస్పిటల్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వేర్వేరు విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు అక్టోబర్ 23 నుండి  ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.

ఇంటర్వ్యూకు ముందు అభర్ధులు ఈఎస్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన విద్యార్హతలు కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవాలి. ఎంసీఐ నియమనిబంధనల ప్రకారం విద్యార్హతలు, ఇతర అర్హతలు ఉన్నవాళ్లే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీస్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.esic.nic.in/ చూడొచ్చు. ఈ ఉద్యోగాలను గుల్బర్గాలోని ఈఎస్‌ఐ హాస్పిటల్‌ లో భర్తీ చేయనున్నారు.

మొత్తం ఉన్న ఖాళీలు- 39
అసోసియేట్ ప్రొఫెసర్- 12
అసిస్టెంట్ ప్రొఫెసర్- 27

also read నిరుద్యోగులకు ముఖ్యమంత్రి గుడ్‌న్యూస్..కొత్తగా 6,500 పోలీసు ఉద్యోగాల భర్తీ.. ...

 ఇంటర్వ్యూలు ప్రారంభ  తేది: 23 అక్టోబర్ 2020
విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు నిర్ణయించారు. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్‌లో చూడవచ్చు.
వయస్సు: గరిష్టంగా 69 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు ఉంటాయి.
జీతం : అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల‌కు నెలకు రూ.92,000, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,06,000 ఉంటుంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు అక్టోబర్ 23న నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. రిజిస్ట్రేషన్స్ ఉదయం 9 గంటలకు మొదలై 11 గంటలకు ముగుస్తాయి.

PREV
click me!

Recommended Stories

నెలనెలా రూ.1,77,500 సాలరీ.. మేనేజర్ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టింగ్
నెలనెలా రూ.2,40,000 జీతం, ఇతర బెనిఫిట్స్ .. డిగ్రీ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్