పదో తరగతితోనే ఇండియన్ నేవీలో ఉద్యోగాలు: అప్లై చేయండి

By rajashekhar garrepally  |  First Published May 7, 2019, 1:06 PM IST

భారత రక్షణ శాఖ పరిధిలోని ఇండియన్ నేవీ.. సెయిలర్(మ్యూజిషియన్) పోస్టుల భర్తీ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు మే 19, 2019లోగా దరఖాస్తు చేసుకోవాలి.
 


భారత రక్షణ శాఖ పరిధిలోని ఇండియన్ నేవీ.. సెయిలర్(మ్యూజిషియన్) పోస్టుల భర్తీ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు మే 19, 2019లోగా దరఖాస్తు చేసుకోవాలి.

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.  నిర్దేశించిన సంగీత సామర్థ్యాలు, మ్యూజికల్ అనుభవ సర్టిఫికేట్స్ ఉండాలి. 157 సెంటిమీటర్ల ఎత్తు ఉండాలి. ఈ పోస్టుల కోసం కొన్ని ఫిజికల్ టెస్టులు పాస్ అవ్వాల్సి ఉంటుంది. 

Latest Videos

undefined

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తుల ప్రారంభ తేదీ: మే 06, 2019
దరఖాస్తులకు చివరి తేదీ: మే 19, 2019

ప్రిలిమినరీ స్క్రీనింగ్: 6-10 జులై, 2019
ఫైనల్ స్క్రీనింగ్: 3-6 సెప్టెంబర్, 2019

వయస్సు: 1994 అక్టోబర్ 1 నుంచి 2002 సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి. 

విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణత.

ఫిజికల్ టెస్ట్: 1.6 కి.మీ దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తి చేయాలి. 10 పుష్‌అప్స్, 20 గుంజీలు.

శిక్షణ: 2019 అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది. 15 వారాలపాటు బేసిక్ ట్రైనింగ్ ఐఎన్ఎస్ చిల్కాలో, మిలటరీ మ్యూజిక్ ట్రైనీగా ముంబైలో 26 వారాలపాటు శిక్షణ ఉంటుంది. 

జీతం, ఇతర అలవెన్సులు: రూ. ట్రైనింగ్‌లో రూ. 14,600, ఆ తర్వాత రూ. 21,700-69,100+5,200 ఎంఎస్‌పీ+డీఏ

ఇతర వివరాల కోసం www.joinindiannavy.gov.in సంప్రదించండి.

click me!