ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతేడాది 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. వాటిలో మిగిలిన ఉద్యోగాలతో పాటు నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే ప్రస్తుత తాజా నోటిఫికేషన్‌కు కూడా వర్తిస్తాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతకు సంక్రాంతి సంధర్భంగా ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,207 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం జనవరి 10నా నోటిఫికేషన్ విడుదల చేశారు.
వీటిలో 14,061 గ్రామ సచివాలయ పోస్టులు ఉండగా 2,146 వార్డు సచివాలయ పోస్టులు ఉన్నాయి. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు శనివారం జనవరి 11 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
undefined
రాష్ట్రంలో కిందటి ఏడాది 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు ఉన్నవాటిలో మిగిలిన ఉద్యోగాలతోపాటు నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే తాజా నోటిఫికేషన్‌కు కూడా వర్తిస్తాయని అధికారులు తెలిపారు.
also read IT Jobs: అమెజాన్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు
ఇప్పటికే సర్వీసులో ఉన్న అభ్యర్థులకు కొన్ని ఉద్యోగాల విషయంలో 10 శాతం మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నారు. రాతపరీక్ష ద్వారానే గ్రామ సచివాలయాల్లోని పోస్టులను భర్తీ చేస్తారు. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో రాత పరీక్షలు నిర్వహిస్తారు. అవసరాలకు అనుగుణంగా నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అన్నారు.
పోస్టుల వివరాలు: గ్రామ సచివాలయ పోస్టులు 14,061, వార్డు సచివాలయ పోస్టులు 2,146 మొత్తం: 16,207 ఖాళీలు
గ్రామ సచివాలయ పోస్టుల వివరాలు
పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5 61
వీఆర్వో గ్రేడ్-2 246
ఏఎన్‌ఎం గ్రేడ్-3 648
విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ 69
విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ 1782
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్-2 536
విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ 43
విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీ 762
ఇంజినీరింగ్ అసిస్టెంట్ 570
డిజిటల్ అసిస్టెంట్ 1134
విలేజ్ సర్వేయర్ గ్రేడ్-3 1255
వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 97
వెటర్నరీ అసిస్టెంట్ 6,858
మొత్తం పోస్టుల సంఖ్య 14,061
also read DELL - డెల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు...వెంటనే అప్లై చేసుకోండీ.
వార్డు సచివాలయ పోస్టుల వివరాలు
వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 105
వార్డు అమినిటీస్ (వసతుల) సెక్రటరీ 371
వార్డు శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ 513
వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 100
వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ 844
వార్డు వెల్ఫేర్, డెవలప్‌మెంట్ సెక్రటరీ 213
మొత్తం పోస్టుల సంఖ్య 2,146