స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలోని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలోని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఉన్న ఖాళీల సంఖ్య 105.
నోటిఫికేషన్ పోస్టుల వివరాలు
undefined
అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ): 03
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేటర్): 09
అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (కేబుల్ జాయింటర్): 03
మెడికల్ సర్వీస్ ప్రొవైడర్ (ట్రైనీ): 25
also read ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ విడుదల...వెంటనే అప్లై చేసుకోండీ...
విభాగాలు: నర్సింగ్-20, పాథాలజీ & బ్లడ్ బ్యాంక్-03, రేడియోగ్రాఫర్-02.
అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ)- హై ప్రెజర్ వెల్డర్-05
అటెండెంట్ కమ్ టెక్నీషియన్: 60
విభాగాలు: ఎలక్ట్రీషియన్-25, ఫిట్టర్-20, మెషినిస్ట్-10, వెల్డర్-05
అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్)/ డిప్లొమా (ఇండస్ట్రియల్ సేఫ్టీ)/ ఎంటెక్ (సేఫ్టీ) అర్హత పొంది ఉండాలి.
మెడికల్ సర్వీస్ ప్రొవైడర్ ఉద్యోగాలకు బీఎస్సీ (నర్సింగ్) (లేదా) ఇంటర్‌తో పాటు డిప్లొమా (జనరల్ నర్సింగ్) అర్హత కలిగి ఉండాలి.
అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత పొంది ఉండాలి.
వయోపరిమితి (27.01.2020 నాటికి) అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 30 సంవత్సరాలలోపు వారై ఉండాలి.మెడికల్ సర్వీస్ ప్రొవైడర్ ఉద్యోగాలకు 28 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలి. అటెండెంట్ కమ్ టెక్నీషియన్ టెక్నీషియన్ ఉద్యోగాలకు 30 సంవత్సరాలలోపు వారై ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు చేసుకునే విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాల వారీగా దరఖాస్తు లింకులు అందుబాటులో ఉంచారు.
also read IRCON'లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...అప్లై చేసుకోవడానికి క్లిక్ చేయండి
ఎంపికల విధానం: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్/ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : పోస్టులవారీగా దరఖాస్తు ఫీజు నిర్ణయించారు.
ఎగ్జి్క్యూటివ్ - అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ)
ప్రొబేషన్: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి ఎంపికైన వారికి E-1 గ్రేడ్ కింద డైరెక్ట్ నియామకం చేస్తారు. వీరికి ఏడాది పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.
నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు
నాన్-ఎగ్టిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల శిక్షణ ఉంటుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసినవారికి నిబంధనల ప్రకారం పేస్కేలు ప్రకారం వేతనం చెల్లిస్తారు.
శిక్షణ కాలంలో మొదటి ఏడాది అటెండెంట్ కమ్ టెక్నీషియన్ పోస్టులకు రూ.8600, రెండో ఏడాది రూ.10,000 చెల్లిస్తారు. ఇక మెడికల్ సర్వీస్ ప్రొవైడర్ పోస్టులకు మొదటి ఏడాది రూ.10,700, రెండో ఏడాది రూ.12,200 చెల్లిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ 06.01.2020 చివరితేది: 27.01.2020
పేమెంట్ రీకాన్సిలియేషన్ స్టేటస్+ఎడిట్ ఆప్షన్ తేదిని ప్రకటించాల్సి ఉంది. అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్, పరీక్ష తేది కూడా ప్రకటించాల్సి ఉంది.