
JEE Mains 2025 Session 2 Results Final Answer Key : లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపులు త్వరలో ముగియనున్నాయి. JEE మెయిన్ 2025 సెషన్ 2 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE మెయిన్ ఫలితాలు 2025 ఏప్రిల్ 19 నాటికి విడుదల చేస్తామని ప్రకటించింది. ఫైనల్ ఆన్సర్ కీ కూడా ఈరోజు అంటే ఏప్రిల్ 18న అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లో అప్‌లోడ్ చేయబడింది.
ఏప్రిల్ 17న కూడా ఫైనల్ ఆన్సర్ కీ అప్‌లోడ్ చేసింది... అయితే కారణమేంటో తెలీదుగానీ తర్వాత దాన్ని తొలగించింది. కొన్ని గంటల తర్వాత మళ్ళీ ఫైనల్ ఆన్సర్ కీ అప్‌లోడ్ చేయబడింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. JEE మెయిన్ ఫలితాలు 2025 ఫైనల్ ఆన్సర్ కీ చూడటానికి డైరెక్ట్ లింక్ కింద ఇవ్వబడింది.
JEE మెయిన్ సెషన్ 2 ఫైనల్ ఆన్సర్ కీ డైరెక్ట్ లింక్
ఈ సంవత్సరం JEE మెయిన్ సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 2 నుండి 9 వరకు జరిగింది. ఇప్పుడు విద్యార్థులు తమ JEE మెయిన్ స్కోర్‌కార్డ్ 2025, ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) మరియు టాపర్స్ జాబితా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీరు రెండు సెషన్‌లకు హాజరైతే, మీ ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంక్ ఇవ్వబడుతుంది.
JEE Main 2025 ఆల్ ఇండియా ర్యాంక్, కాలేజీ ఎంపికల ఆధారంగా JoSAA/CSAB కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్లు జరుగుతాయి. ఈ సమయంలో గుర్తింపు కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, అర్హత పరీక్ష సర్టిఫికెట్, రాష్ట్ర కోటా, కేటగిరీ, దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం వంటి డాక్యుమెంట్లను పరిశీలిస్తారు.