విదేశీ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విదేశీ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించే మైనారిటీ విద్యార్థులకు(ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, బౌద్దులు, పార్శీలు) సీఎం విదేశీ విద్యా పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు.
also read ఏపి పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల...
డిగ్రీ (ఇంజినీరింగ్)లో 60 శాతం మార్కులు ఉండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్య అభ్యసించదలచిన వారితోపాటు పీజీలో 60 శాతం మార్కులు వచ్చి పీహెచ్‌డీ చేయాలనుకునే వారికి మాత్రమే ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు
. ఈ పథకం ద్వారా లబ్ధి పొందగలిగే విద్యార్థులు పాల్(ఫాల్) సీజన్ 2019(ఆగస్టు 2019 నుంచి డిసెంబర్ 2019) వరకు ఎంపిక చేయబడిన విదేశీ వర్సిటీల్లో అడ్మిషన్ పొంది ఉండాలన్నారు.
అర్హత ఉన్న విద్యార్థులు ధ్రువపత్రాలతో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఈనెల 12 నుంచి మార్చి 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
also read డిగ్రీ ఫలితాల రివాల్యుయేషన్ దరఖాస్తుల స్వీకరణ....
2019 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు ఏదైనా విదేశీ విశ్వవిద్యాలయంలో పి.జి. లేదా డాక్టోరల్ ప్రోగ్రామ్స్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://telanganaepass.cgg.gov.in/ ను సందర్శించవచ్చు. ఫిబ్రవరి 12 నుండి 12 మార్చి 2020 వరకు దరఖాస్తులను నమోదు చేసుకోవచ్చు. 040-23240134 నంబరులో లేదా జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయం హౌస్ 6వ అంతస్తులో సంప్రదించవచ్చన్నారు.