బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)లో పలు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 19న ప్రారంభమై మే 9న ముగుస్తుంది. అభ్యర్థుల ఎంపిక డైరెక్ట్ రిక్రూట్ ద్వారా జరుగుతుంది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) 337 ఖాళీలు ఏర్పడ్డాయి. స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (SSA), సీనియర్ టెక్నీషియన్, పర్సనల్ అసిస్టెంట్ (PA) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి సంస్థ దరఖాస్తులను కొరుతోంది. సంస్థ వెబ్‌సైట్ www.bis.gov.inలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ pdf రూపంలో అప్‌లోడ్ చేశారు. ఏప్రిల్ 19 నుండి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మే 9 చివరి తేదీ. వ్రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు పరీక్షకు 10 రోజుల ముందు ఇష్యూ చేయబడుతాయి. పరీక్ష జూన్‌లో నిర్వహించబడుతుంది.
పోస్టుల వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో 337 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
Director (Legal): 1
Assistant Director: 3
Personal Assistant: 28
Assistant Section Officer: 47
Assistant (Computer Aided Design): 2
Stenographer: 22
Senior Secretariat Assistant: 100
Horticulture Supervisor: 1
Technical Assistant (Laboratory): 47
Senior Technician post: 25
అసిస్టెంట్ డైరెక్టర్ (హిందీ), అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్ & ఫైనాన్స్), అసిస్టెంట్ డైరెక్టర్ (మార్కెటింగ్ & కన్స్యూమర్ అఫైర్స్) పోస్టులకు దరఖాస్తు రుసుము రూ. 800 ఉండగా.. ఇతర పోస్టులకు రూ. 500 రుసుము ఉంటుంది.