APPSC ACF Recruitment 2022: ఏపీలో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీ.. జీతం ఎంతో తెలుసా..?

By team teluguFirst Published Apr 19, 2022, 12:43 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఏపీలో ఫారెస్ట్ సర్వీస్ విభాగంలో పోస్టుల భర్తీ చేపట్టనుంది. అభ్యర్ధుల ఎంపిక విధానానికి సంబంధించి రాత పరీక్ష అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది.
 

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఏపీలో ఫారెస్ట్ సర్వీస్ విభాగంలో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. మొత్తం 9 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నిర్ధేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

అభ్యర్ధుల ఎంపిక విధానానికి సంబంధించి రాత పరీక్ష అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పరీక్ష పూర్తిగా అబ్జెక్టీవ్ విధానంలో ఉంటుంది. మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు 40,270రూ నుండి 93,780రూ జీతభత్యాలుగా చెల్లిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 20, 2022 నుండి ప్రారంభమౌతుంది. దరఖాస్తలకు చివరి తేది మే 10, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://psc.ap.gov.in/ పరిశీలించగలరు.

Latest Videos


మొత్తం ఖాళీల సంఖ్య: 9

- పోస్టుల వివరాలు: అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టులు

- వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

- పే స్కేల్: నెలకు రూ.40,270ల నుంచి రూ.93,780ల వరకు జీతంగా చెల్లిస్తారు.

- అర్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ/సంబంధిత స్పెషలైజేషన్‌లో తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

- ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

- రాత పరీక్ష విధానం: ఈ పరీక్షను మొత్తం 6 పేపర్లను 600ల మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. క్వాలిఫైయింగ్ పేపర్లు జనరల్ ఇంగ్లిష్‌కు 50 మార్కులు, జనరల్ తెలుగుకు 50 మార్కులుంటాయి.

- దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

- దరఖాస్తులకు చివరి తేదీ: మే 10, 2022.

- పూర్తి సమాచారం కోసం సంబంధిత‌ వెబ్ సైట్‌ను చూడండి.

click me!