Bank Jobs: బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్రలో ఉద్యోగాలు...

Published : Dec 12, 2019, 03:47 PM ISTUpdated : Dec 12, 2019, 03:49 PM IST
Bank Jobs: బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్రలో  ఉద్యోగాలు...

సారాంశం

బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్రలో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సరైన అర్హతలు కలిగి, అనుభవం గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.  

మహారాష్ట్రలోని పూణే ప్రధాన‌కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్రలో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ పోస్టుల భర్తీకి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా పీజీ డిగ్రీ అర్హత పొందిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తగిన అర్హత కలిగిన వారు 16  డిసెంబరు నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల భ‌ర్తీకి మొత్తం ఖాళీల సంఖ్య 50.


స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భ‌ర్తీ వివ‌రాలు

నెట్‌వ‌ర్క్ & సెక్యూరిటీ అడ్మినిస్ట్రేట‌ర్    11, డేటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్‌ (యూనిక్స్) 07, ప్రొడ‌క్షన్ సపోర్ట్ ఇంజినీర్ 07, ఈమెయిల్ అడ్మినిస్ట్రేటర్ 02, బిజినెస్ అనలిస్ట్ 05

also read  నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం...రేపు ఒక్క రోజే మాత్రమే...

కావల్సిన అర్హత‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత‌,ఇంకా అనుభ‌వం.

వ‌యోపరిమితి: 31.03.2019 నాటికి 35 సంవత్సరాలకు మించకూడ‌దు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో
సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.118 (ఇంటిమేషన్ చార్జీలు), ఇతరులకు రూ.1180. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

also read ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో ఖాళీలు... పదోతరగతి లేదా ఐటీఐ అర్హత ఉంటే చాలు

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్/ ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభపు తేది 16.12.2019  చివ‌రితేది 31.12.2019 రాతపరీక్ష తేదీని ఇంకా వెల్లడించాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ
Police Recruitment : 2026 లోనే తెలుగు యువత కల సాకారం.. ఖాకీ డ్రెస్ వేసి, సింహాల టోపీ పెట్టేందుకు సిద్దమా..?