కరోనాను నిరోధించేందుకు తయారు చేస్తున్న వ్యాక్సిన్ పై ప్రయోగాలు విజయవంతంగా పూర్తైనట్టుగా రష్యాలోని సెచెనోవ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.
మాస్కో: కరోనాను నిరోధించేందుకు తయారు చేస్తున్న వ్యాక్సిన్ పై ప్రయోగాలు విజయవంతంగా పూర్తైనట్టుగా రష్యాలోని సెచెనోవ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.
కరోనా నివారణకు గాను రష్యాకు చెందిన గమలీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ మైక్రో బయాలజీ వ్యాక్సిన్ తయారు చేస్తోంది. ఈ మేరకు ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను ఈ ఏడాది జూన్ 18వ తేదీన ప్రారంభించింది.
undefined
also read:రాజ్‌భవన్‌లో 10 మందికి కరోనా: తెలంగాణ గవర్నర్ తమిళిసైకి నెగిటివ్
పరీక్షలు చేపట్టిన తొలి గ్రూప్ వాలంటీర్లు బుధవారం నాడు డిశ్చార్జ్ కానున్నారు. రెండో గ్రూప్ ఈ నెల 20న డిశ్చార్జ్ కానున్నారు. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని యూనివర్శిటిలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ పారాసిటాలజీ సంస్థ ప్రకటించారు. ఆ సంస్థ డైరెక్టర్ లుకాషెవ్ తెలిపారు.
వ్యాక్సిన్ల భద్రతకు అనుగుణంగా ఉంటుందని ఆయన వివరించారు. కరోనా నివారణకు గాను ప్రపంచంలోని పలు సంస్థలు ప్రయోగాలు చేస్తున్నాయి.
కొన్ని సంస్థలు ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించాయి. మరికొన్ని సంస్థలు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఇండియాలో ఈ ఏడాది ఆగష్టు 15 నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తామని ఐసీఎంఆర్ ప్రకటించింది.