కవ్వింపులు మానని నేపాల్.. భారతీయ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేత

By Siva KodatiFirst Published Jul 10, 2020, 5:01 PM IST
Highlights

చైనా చేతిలో కీలుబొమ్మగా మారిన నేపాల్ ప్రభుత్వం భారతదేశంతో తన గిల్లికజ్జాలు మానడం లేదు. భారత్‌కి చెందిన న్యూస్ ఛానెళ్లను నేపాల్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ నిలిపివేశారు.

చైనా చేతిలో కీలుబొమ్మగా మారిన నేపాల్ ప్రభుత్వం భారతదేశంతో తన గిల్లికజ్జాలు మానడం లేదు. భారత్‌కి చెందిన న్యూస్ ఛానెళ్లను నేపాల్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ నిలిపివేశారు.

దూరదర్శన్ మినహా మనదేశానికి చెందిన అన్ని న్యూస్ ఛానెళ్లను నేపాల్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భారతీయ టీవీ ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేయాల్సిందిగా నేపాల్ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆదేశాలు అందనప్పటికీ తామే స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.

భారతీయ టీవీ ఛానెళ్లలో తమ దేశానికి, ప్రధాని కేపీ శర్మ ఓలికి వ్యతిరేకంగా కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయని.. ఇవి నేపాలీల ఆత్మగౌరవానికి విలువ ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని కేబుల్ ఆపరేటర్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్, చైనాకు చెందిన టీవీ ఛానెళ్ల ప్రసారాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

కాగా నేపాల్‌లో భారత్‌ టీవీ ఛానెళ్ల కార్యక్రమాలను నియంత్రించాలంటూ మాజీ డిప్యూటీ ప్రధాని, అధికార పార్టీ ప్రతినిధి నారాయణ కాజీ శ్రేష్ట గురువారం ఉదయం పిలుపునిచ్చారు. ఆయన ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే నేపాల్ కేబుల్ ఆపరేటర్లు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 
 

click me!