కరోనా ఎఫెక్ట్: తొలిసారిగా మాస్క్ ధరించిన ట్రంప్

By narsimha lode  |  First Published Jul 12, 2020, 10:27 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం నాడు మాస్క్ ను ధరించాడు. దేశంలో కరోనాకు సంబంధించిన అత్యధిక కేసులు నమోదైన సమయంలో కూడ ట్రంప్ మాత్రం ఎలాంటి మాస్కులు దరించలేదు. తాను మాస్కును ధరించనని కూడ ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.


వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం నాడు మాస్క్ ను ధరించాడు. దేశంలో కరోనాకు సంబంధించిన అత్యధిక కేసులు నమోదైన సమయంలో కూడ ట్రంప్ మాత్రం ఎలాంటి మాస్కులు దరించలేదు. తాను మాస్కును ధరించనని కూడ ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

అమెరికాలోని బెథెస్థ మేరీల్యాండ్ లో గాయపడిన సైనికులు, వ్యైదులను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ట్రంప్ మాస్క్ ను ధరించాడు. 

Latest Videos

undefined

తన సిబ్బందితో కలిసి ఆసుపత్రిని సందర్శించిన సమయంలో ట్రంప్ నలుపు రంగు ముసుగులు ధరించాడు. ముసుగుతో మీడియాతో మాట్లాడేందుకు మాత్రం ట్రంప్ ఇష్టపడరు. బహిరంగంగా ప్రజల్లో తిరిగిన సమయంలో ట్రంప్ మాస్క్ ధరించడం ఇదే తొలిసారి.

అమెరికా ఎన్నికల ప్రచారంలో కూడ ట్రంప్ మాస్క్ ధరించడంపై చర్చ సాగింది. మాజీ అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ అధికార ప్రతినిధి అండ్రూ బేట్స్  ట్రంప్ మాస్క్ ధరించడంపై స్పందించారు.కరోనా విజృంభిస్తున్న  సమయంలో అమెరికన్లు మాస్కులు ధరించకుండా ట్రంప్ నిరుత్సాహర్చాడని ఆయన ఆరోపించారు. 

డొనాల్డ్ ట్రంప్ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను విస్మరించారని బేట్స్ విమర్శించారు. కరోనా వైరస్ ను నిరోధించడంలో మాస్క్ ప్రధానంగా పనిచేస్తోందని బేట్స్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ట్రంప్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న అధికారులు ఇటీవల కాలంలో కరోనా సోకింది. ట్రంప్ కొడుకు జూనియర్ ట్రంప్ ప్రియురాలు కింబర్లీ గిల్ ఫోయల్ ఈ నెల 3వ తేదీన కరోనా సోకిన విషయం తెలిసిందే.

click me!