ఈ వజ్రం దొరికిన విషయాన్ని లుకారా డైమండ్ కార్పొరేషన్ ఓ ప్రకటన లో తెలియజేసింది. కరోవే గనిలో ఏర్పాటు చేసిన ఎక్స్ రే డిటెక్షన్ టెక్నాలజీ ఆధారంగా దీనిని గుర్తించారు.
డైమండ్స్.. మీరు ఇప్పటి వరకు ఎన్ని క్యారెట్లవి చూసి ఉంటారు...? కానీ... ఎప్పుడైనా 2,492 క్యారెట్ల విలువచేసే వజ్రాన్ని ఎప్పుడైనా చూశారా..? అంత పెద్ద వజ్రాన్ని తాజాగా కనుగొన్నారు. ఈ వజ్రాన్ని బోట్స్ వానా దేశంలో కనుగొన్నారు. ప్రపంచంలో అధికంగా వజ్రాలను ఉత్పత్తి చేసే దేశాల్లో ఇది ఒకటి. కాగా... ఈ దేశంలోని కరోవే గనిలో 2, 492 క్యారెట్ల డైమండ్ దొరికింది. ఇది ప్రపంచంలోనే రెండో అతి పెద్ద వజ్రం కావడం విశేషం.
ఈ వజ్రం దొరికిన విషయాన్ని లుకారా డైమండ్ కార్పొరేషన్ ఓ ప్రకటన లో తెలియజేసింది. కరోవే గనిలో ఏర్పాటు చేసిన ఎక్స్ రే డిటెక్షన్ టెక్నాలజీ ఆధారంగా దీనిని గుర్తించారు.
గతంలో అంటే 1905లో దక్షిణాఫ్రికాలో ఓ వజ్రాన్ని కనుగొన్నారు. అది 3, 106 క్యారెట్లు కావడం విశేషం. అది మొదటి అతి పెద్ద వజ్రం కాగా.. ఇప్పుడు దొరికింది రెండో అతి పెద్ద డైమండ్. 2019లో ఇదే గనిలో ఓ డైమండ్ దొరికింది. ఈ డైమండ్ 1,758 క్యారెట్లు కాగా... ఈసారి దొరికింది అంతకంటే పెద్దది కావడం విశేషం.
బోట్స్ వానా ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాలను ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటి, ఇది ప్రపంచ ఉత్పత్తిలో 20% వాటాను కలిగి ఉంది. ఇప్పటి వరకు వెలికి తీసిన అతి పెద్ద వజ్రం ఇదేనని లుకారా సంస్థ చెప్పడం విశేషం. ఇంత అసాధారణమైన వజ్రం దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని లుకారా హెడ్ విలియం లాంబ్ తెలిపారు. అయితే... ఈ వజ్రం ధర, నాణ్యత వివరాలను మాత్రం కంపెనీ ఇప్పటి వరకు ప్రకటించకపోవడం గమనార్హం.