కోర్టు తీర్పుతో పాపులర్ రెస్టారెంట్ మూత.. ఊడిన 700+ ఉద్యోగాలు, కన్నీరుమున్నీరవుతున్న ఉద్యోగులు.. వైరల్ వీడియో

By Mahesh Rajamoni  |  First Published Aug 22, 2024, 10:32 AM IST

Pakistan Monal restaurant closed: ఒక పాపులర్ రెస్టారెంట్ ను మూసివేయాల‌ని కోర్టు ఇచ్చిన తీర్పును విన్న త‌ర్వాత అక్క‌డ ప‌నిచేసే ఉద్యోగులు ఏడుపు ఆపుకోలేకపోయారు. 2006లో ప్రారంభమైనప్పటి నుంచి 'మోనాల్' ఆ ప్రాంతంలో పాపులర్ రెస్టారెంట్ గా పనిచేస్తోంది. ఉద్యోగులు ఏడుస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.  


Pakistan Monal restaurant closed: పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక ప్రముఖ రెస్టారెంట్ ను మూసివేయాలని పాకిస్తాన్‌లోని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర బాధతో ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇస్లామాబాద్‌లోని ప్రసిద్ధ రెస్టారెంట్  "మోనల్" కోర్టు ఆదేశాలతో మూసివేశారు. ఈ రెస్టారెంట్ మూతతో 700 మందికి పైగా ఉద్యోగులు ఒక్కసారిగా నిరుద్యోగులుగా మారారు. ఉన్న ఉద్యోగాలు కోర్టు తీర్పుతో ఒక్కసారిగా కోల్పోవడంతో ఆ బాధను తట్టుకోలేక సిబ్బంది బోరున విలపిస్తున్న వీడియో సోషల్ మీడియాను కదిలించింది.

ఇస్లామాబాద్‌లోని మార్గల్లా హిల్స్ నేషనల్ పార్క్‌లోని మోనల్‌తో సహా అన్ని హోటళ్లను మూసివేయాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని డాన్ పత్రిక నివేదించింది. ఈ ప్రాంతంలోని పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని 2024 జూన్ 11న పాక్ సుప్రీంకోర్టు హోటళ్లను మూసివేయాలని ఆదేశించింది. కోర్టు తీర్పు మేరకు, రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్న మోనల్ రెస్టారెంట్ 2024 సెప్టెంబర్ 11న శాశ్వతంగా మూసివేయనున్నట్లు ప్రకటించింది. 2006లో ప్రారంభించబడినప్పటి నుండి ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ప్రసిద్ధ రెస్టారెంట్ గా మోనల్ గుర్తింపు సాధించింది.

Latest Videos

undefined

సెహ్వాగ్ నుండి మెకల్లమ్ వరకు.. టెస్ట్ క్రికెట్‌లో టాప్-5 ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీలు ఇవే

35 ఫోర్లు 248* ప‌రుగులతో సునీల్ గ‌వాస్క‌ర్ రికార్డును బ్రేక్ చేసిన స‌చిన్ టెండూల్క‌ర్

ఇస్లామాబాద్ పర్యాటకానికి గణనీయమైన తోడ్పాటును అందించిన మార్గల్లా హిల్స్ నేషనల్ పార్క్‌లోని ప్రసిద్ధ రెస్టారెంట్ మోనల్. రెస్టారెంట్ ను మూసివేయాలనే కోర్టు తీర్పుతో ఉద్యోగులు వెంటనే షాక్ గురయ్యారు. తీర్పు తర్వాత తన భవిష్యత్తు గురించి ఆలోచించి కుప్పకూలిన ఒక కార్మికుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలోని ఇతర కార్మికులు కూడా బాధను తట్టుకోలేక ఏడుస్తున్నట్లు కనిపించింది. ఉద్యోగుల చేతిలో తొలగింపు నోటీసులు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం గురించి మోనల్ యజమాని లుక్మాన్ అలీ అఫ్జల్ వివరించాడని నివేదికలు చెబుతున్నాయి.

"ప్రతి ఒక్కరికీ రాత్రికి రాత్రే ఉద్యోగం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను, కానీ ప్రస్తుత ఆర్థిక సంక్షోభం దృష్ట్యా, గ్రూప్ మిమ్మల్ని ఇతర ప్రాజెక్టులకు బదిలీ చేయలేకపోతోంది. దీనిని దేవుని చిత్తంగా అంగీకరించి ప్రత్యామ్నాయ ఉపాధి కోసం వెతకడం ప్రారంభించండి" అని అతను ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. వీడియో వైరల్ అయిన తర్వాత, చాలా మంది సోషల్ మీడియా యూజర్లు కార్మికుల బాధను పంచుకున్నారు. 'ఇది చాలా బాధాకరం' అని పేర్కొంటున్నారు.

click me!